Delhi Shootout: కోర్టులో కాల్పుల ఘటనపై సీజేఐ విచారం - telugu news delhi court shootout incident cji nv ramana expresses regret
close
Published : 24/09/2021 23:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Delhi Shootout: కోర్టులో కాల్పుల ఘటనపై సీజేఐ విచారం

దిల్లీ: దిల్లీలోని రోహిణి ఆవరణలో కాల్పుల ఘటనపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌.వి.రమణ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఘటనకు సంబంధించి దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సీజేఐ మాట్లాడారు. కోర్టు కార్యకలాపాలకు భంగం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. పోలీసులు, బార్‌ కౌన్సిల్‌ సభ్యులతో మాట్లాడాలని సూచించారు. కోర్టుల భద్రత అంశం ఇప్పటికే సుప్రీంకోర్టు పరిశీలనలో ఉందని అన్నారు. రోహిణి కోర్టులో కాల్పుల ఘటనతో భద్రత మళ్లీ చర్చనీయాంశమైంది. ఈ అంశంపై వచ్చే వారం ప్రాధాన్యం ఇస్తామని సీజేఐ జస్టిస్‌ ఎన్.వి.రమణ పేర్కొన్నారు.

దిల్లీలోని రోహిణి కోర్టు ఆవరణలో ఓ గ్యాంగ్‌స్టర్‌ లక్ష్యంగా ప్రత్యర్థి గ్యాంగ్‌ శుక్రవారం కాల్పులకు పాల్పడింది. ఈ ఘటనలో గ్యాంగ్‌స్టర్‌ జితేందర్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు దుండగులు హతమయ్యారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని