Kondapolam: ‘కొండపొలం’ నుంచి మరో వీడియో సాంగ్‌ వచ్చేసింది..! - telugu news dham dham video song from kondapolam out now
close
Published : 16/10/2021 13:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Kondapolam: ‘కొండపొలం’ నుంచి మరో వీడియో సాంగ్‌ వచ్చేసింది..!

హైదరాబాద్‌: వైష్ణవ్‌ తేజ్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ జంటగా నటించిన సరికొత్త చిత్రం ‘కొండపొలం’. స‌న్నపురెడ్డి వెంక‌ట‌రామిరెడ్డి రాసిన న‌వ‌ల ఆధారంగా క్రిష్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. దసరా కానుకగా ఈ నెల 8న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మిశ్రమ స్పందనలు అందుకుంది. కాగా, తాజాగా ఈ సినిమా నుంచి ‘ధమ్‌ ధమ్‌ ధమ్‌’ పాట పూర్తి వీడియోని చిత్రబృందం శనివారం సోషల్‌మీడియా వేదికగా షేర్‌ చేసింది. అడవి తల్లి గొప్పతనాన్ని చెబుతూ సాగే ఈ పాట ఆకట్టుకునేలా ఉంది. కీరవాణి స్వరాలు అందించగా.. రాహుల్‌ సిప్లిగంజ్‌, ధామిని ఈ పాటను ఆలపించారు. మరోవైపు ఈ సినిమాలో రవీంద్రనాథ్‌ అనే యువకుడిగా వైష్ణవ్‌.. ఓబులమ్మ అనే యువతిగా రకుల్‌ డీ గ్లామర్‌ లుక్‌లో కనిపించి ప్రేక్షకుల్ని మెప్పించారు.



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని