RRR: ఎదురుచూపులకు ఇక ఫుల్‌స్టాప్‌.. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నుంచి ‘దోస్తీ’ సాంగ్‌ వచ్చేసింది..! - telugu news dosti song from rrr out now
close
Updated : 01/08/2021 16:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

RRR: ఎదురుచూపులకు ఇక ఫుల్‌స్టాప్‌.. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నుంచి ‘దోస్తీ’ సాంగ్‌ వచ్చేసింది..!

హైదరాబాద్‌: ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ సంగీత ప్రియుల ఎదురుచూపులకు సమాధానం చెబుతూ రామ్‌చరణ్‌-తారక్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నుంచి ‘దోస్తీ’ సాంగ్‌ వచ్చేసింది. స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం ఉదయం విడుదలైన ఈ పాట ప్రతిఒక్కర్నీ ఎంతో ఆకట్టుకునేలా ఉంది. కీరవాణి సారథ్యంలో హేమచంద్ర (తెలుగు), అమిత్‌ త్రివేది (హిందీ), అనిరుధ్‌ (తమిళం), యాజిన్‌ నిజార్‌ (కన్నడ), విజయ్‌ జేసుదాస్‌ (మలయాళం).. ఇలా ఐదు భాషలకు చెందిన ఐదుగురు సంగీత యువ కెరటాలు ఈ పాటను హుషారెత్తించేలా ఆలపించారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో రామ్‌చరణ్‌-తారక్‌ల స్నేహానికి ప్రతీకగా ఈ పాటను రూపొందించినట్లు అర్థమవుతోంది.

‘పులికి వీలుగాడికి.. తలకి ఉరితాడుకి.. కదిలే కార్చిచ్చుకి.. కసిరే బడగళ్లకి.. రవికి మేఘానికీ.... ‘దోస్తీ’ ఊహించని చిత్రమే చిత్రం.. స్నేహానికి చాచిన హస్తం.. ప్రాణానికి ప్రాణం ఇస్తుందో తీస్తుందో.. ’ అంటూ సాగే ఈ పాట ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో తారక్‌, చరణ్‌ల మధ్య దోస్తీని ప్రతిబింబించేలా ఉంది. విభిన్నమైన మనస్థత్వాలు గల వ్యక్తులకు స్నేహం కుదరడం.. చివరికి అది ఎటువైపునకు దారి తీస్తుంది అనేది ప్రధానాంశంగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో చూపించినట్లు ఈ పాట ద్వారా అర్థమవుతోంది.

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహించారు. ఇందులో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌, కొమురంభీమ్‌గా తారక్‌ కనిపించనున్నారు. ఆలియాభట్‌, ఒలీవియా మోరీస్‌, రేయ్‌ స్టీవ్‌సన్‌, ఆలిసన్‌ డ్యూడీ, శ్రియ, అజయ్‌ దేవ్‌గణ్‌, సముద్రఖనిలతోపాటు పలువురు ప్రముఖ నటీనటులు ఈ సినిమాలో కీలకపాత్రలు పోషించారు. అక్టోబర్‌ 13న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ప్రమోషన్స్‌లో భాగంగా ‘దోస్తీ’ పాటను విడుదల చేశారు. మరోవైపు ఇటీవల విడుదల చేసిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మేకింగ్‌ వీడియోతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.









మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని