Cinema News: శర్వానంద్‌ చిత్రంలో ముగ్గురు ఎవర్‌గ్రీన్‌ తారలు.. - telugu news ever green actresses in sharwanand movie directed by kishore tirumala
close
Published : 03/08/2021 14:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

 Cinema News: శర్వానంద్‌ చిత్రంలో ముగ్గురు ఎవర్‌గ్రీన్‌ తారలు..

ఇంటర్నెట్‌ డెస్క్: శర్వానంద్‌, రష్మిక జంటగా తెరకెక్కుతోన్న చిత్రం ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. కిశోర్‌ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ముగ్గురు సీనియర్‌ నటీమణులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వాళ్లే రాధిక, ఖుష్బూ, ఊర్వశి. వినూత్నమైన ఈ కథకి ఈ ముగ్గురు తారల్ని ఎంపిక చేసినట్టు సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటించింది చిత్ర బృందం. ఒక్క సీనియర్‌ నటి ఉంటేనే ఆయా చిత్రాలపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతుంది. అలాంటిది ఒకే చిత్రంలో ముగ్గురు ఎవర్‌గ్రీన్‌ తారలు నటిస్తుండటంతో ఈ చిత్రంపై అంచనాలు పెరుగుతున్నాయి. ‘అజ్ఞాతవాసి’ తర్వాత ఖుష్బూ, ‘రాజా ది గ్రేట్‌’ తర్వాత రాధిక, ‘రాజు గారి గది 3’ తర్వాత ఊర్వశి నటిస్తున్న తెలుగు చిత్రమిదే. చాలాకాలం తర్వాత మరోసారి తెలుగు ప్రేక్షకుల్ని అలరించేందుకు వీరు సిద్ధమయ్యారు. మరి వీళ్లు ఈ చిత్రంలో ఎలాంటి పాత్రలు పోషిస్తున్నారో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్‌ పతాకంపై చెరుకూరి సుధాకర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. లాక్‌డౌన్‌ అనంతరం ఇటీవల ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది.




మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని