ఫ్యామిలీ మ్యాన్‌ దర్శకులతో..! - telugu news familyman directors plans to direct another series
close
Published : 18/09/2021 12:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఫ్యామిలీ మ్యాన్‌ దర్శకులతో..!

‘ది ఫ్యామిలీ మ్యాన్‌’ సిరీస్‌లతో అందరి చేత ప్రశంసలు అందుకున్నారు దర్శక ద్వయం రాజ్, డీకే. ఇప్పుడు వీళ్లిద్దరూ మరో కొత్త వెబ్‌సిరీస్‌కు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో ప్రముఖ బాలీవుడ్‌ యువ కథానాయకుడు రాజ్‌కుమార్‌ రావ్, మరో ప్రముఖ నటుడు దిల్జిత్‌ దోసాంజ్‌లు నటించనున్నట్టు సమాచారం. వీళ్ల పక్కన నాయికలుగా ఎవరు నటిస్తారనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. ‘‘రాజ్‌కుమార్‌ రావ్, దిల్జిత్‌ దోసాంజ్‌లను మేం అనుకుంటున్నాం. కానీ మా మధ్య ఇంకా ఒప్పందం జరగలేదు’’అని రాజ్‌ అండ్‌ డీకే సన్నిహితులు చెప్పినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రాజ్‌కుమార్‌ ‘హమ్‌ దో హమారే దో’, ‘బధాయి దో’, ‘హిట్‌’ తదితర చిత్రాల్లో నటిస్తున్నారు. రాజ్, డీకే ద్వయం షాహిద్‌ కపూర్, విజయ్‌ సేతుపతి, రాశీ ఖన్నా ప్రధాన పాత్రల్లో ఓ వెబ్‌సిరీస్‌ను తెరకెక్కిస్తున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని