Sammathame: సతమతమూ ‘సమ్మతమే’.. అలరిస్తోన్న కిరణ్‌, చాందినీ జోడీ - telugu news first glimpse of sammathame kiran abbavaram
close
Published : 21/10/2021 16:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Sammathame: సతమతమూ ‘సమ్మతమే’.. అలరిస్తోన్న కిరణ్‌, చాందినీ జోడీ

హైదరాబాద్‌: ‘రాజావారు రాణిగారు’తో కథానాయకుడిగా పరిచయమై ‘ఎస్‌.ఆర్‌. కళ్యాణమండపం’తో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు నటుడు కిరణ్‌ అబ్బవరం. ప్రస్తుతం ఆయన నటిస్తోన్న చిత్రం ‘సమ్మతమే’. గోపీనాథ్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. కిరణ్‌కు జోడీగా ‘కలర్‌ ఫొటో’ ఫేమ్‌ చాందినీ చౌదరి నటిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న ‘సమ్మతమే’ నుంచి ఫస్ట్‌ గ్లిమ్స్‌ను చిత్ర బృందం గురువారం సోషల్‌ మీడియా వేదికగా షేర్‌ చేసింది. యూత్‌ఫుల్‌ ప్రేమ కథా చిత్రంగా ఈ సినిమా సిద్ధం కానున్నట్లు తెలుస్తోంది. ‘కొత్త కొత్తగా ఉన్నది స్వర్గం ఇక్కడే అన్నది’, ‘అందంగా లేనా? అసలేం బాలేనా?’ అంటూ నటీనటుల మధ్య సాగే సంభాషణలు ఆకట్టుకునేలా ఉన్నాయి. ‘సతమతమూ సమ్మతమే’ అంటూ సాగే నేపథ్య సంగీతం మెప్పిస్తోంది.



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని