Adivi Sesh: ‘గూఢచారి 2’ అప్‌డేట్‌ ఎప్పుడంటే? - telugu news goodachari sequel announcement soon adivi sesh
close
Published : 03/08/2021 12:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Adivi Sesh: ‘గూఢచారి 2’ అప్‌డేట్‌ ఎప్పుడంటే?

ఇంటర్నెట్‌ డెస్క్‌: స్పై థ్రిల్లర్‌ నేపథ్యంలో తెలుగు ప్రేక్షకుల్ని విశేషంగా అలరించిన చిత్రం ‘గూఢచారి’. ఈ ఉత్కంఠభరిత చిత్రానికి సీక్వెల్‌ తీసుకొస్తున్నట్టు చిత్ర బృందం కొన్నాళ్ల క్రితమే ప్రకటించింది. దానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే రానున్నాయి. ఈ చిత్రం విడుదలై మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కథానాయకుడు అడివి శేష్‌ ఈ విషయాన్ని తెలియజేశారు. ‘‘గూఢచారి’ చిత్రానికి మూడేళ్లు. నాకు బాగా ఇష్టమైన సినిమా ఇది. ఆగస్టు నెల నాకు బాగా కలిసొచ్చింది. ఈ క్రమంలో ‘గూఢచారి 2’కి సంబంధించి పెద్ద అప్‌డేట్‌ ఈ నెలలోనే రాబోతుంది’’ అని పేర్కొన్నారు. 2018 ఆగస్టు 3న విడుదలైన ఈ సినిమా మంచి విజయం అందుకుంది. చూపు తిప్పుకోనివ్వని కథ, కథనాలతో ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. శశి కిరణ్‌ తిక్క దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అభిషేక్‌ నామ, అభిషేక్‌ అగర్వాల్‌, టి.జి. విశ్వ ప్రసాద్‌ నిర్మించారు. శోభిత దూళిపాళ్ల, ప్రకాశ్‌ రాజ్‌, జగపతి బాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. సీక్వెల్‌.. తొలి భాగాన్ని మించి థ్రిల్‌ పంచేందుకు సిద్ధమవుతోంది.




మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని