Hanuman: హను-మాన్‌ ఫస్ట్‌లుక్‌ వచ్చేసింది..! - telugu news hanuman first look out now
close
Published : 18/09/2021 11:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Hanuman: హను-మాన్‌ ఫస్ట్‌లుక్‌ వచ్చేసింది..!

హైదరాబాద్‌: ‘అ!’, ‘జాంబిరెడ్డి’ వంటి విభిన్న జోనర్‌ చిత్రాలతో దర్శకుడిగా ప్రేక్షకులకు చేరువయ్యారు ప్రశాంత్‌వర్మ. ఆయన రూపొందిస్తున్న సరికొత్త చిత్రం ‘హను-మాన్‌’. తేజ సజ్జా కథానాయకుడు. తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌, మోషన్‌ పోసర్లను శనివారం ఉదయం ప్రముఖ నటుడు దుల్కర్‌ సల్మాన్‌ విడుదల చేశారు. ఇందులో తేజ హనుమంతుడిగా విభిన్నమైన లుక్‌లో కనిపించనున్నారు. హ‌ను-మాన్ చిత్రం కోసం ప్రశాంత్‌ వర్మ అంజనాద్రి అనే కొత్త, ఫాంటసీ ప్రపంచాన్ని సృష్టించినట్లు తెలుస్తోంది. ‘జాంబిరెడ్డి’ విజయం తర్వాత తేజ-ప్రశాంత్‌వర్మ కాంబినేషన్‌లో వస్తోన్న రెండో చిత్రమిది. ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిరంజన్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇతర నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది.



Advertisement


మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని