Nagarjuna: జగన్‌ని చూసి చాలా రోజులైంది.. అందుకే విజయవాడ వచ్చా! - telugu news hero nagarjuna lunch with ap cm jagan mohan reddy
close
Updated : 28/10/2021 20:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Nagarjuna: జగన్‌ని చూసి చాలా రోజులైంది.. అందుకే విజయవాడ వచ్చా!

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh) ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి(AP CM YS Jagan Mohan Reddy)ని చూసి చాలా రోజులైందని, అందుకే తాను విజయవాడ వచ్చినట్లు సినీ నటుడు, నిర్మాత నాగార్జున (Nagarjuna) అన్నారు. గురువారం ఏపీ మంత్రి వర్గ సమావేశం అనంతరం నాగార్జునతో సీఎం జగన్‌ భేటీ అయ్యారు. ఇద్దరూ కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా పలు అంశాలను ఇరువురు చర్చించినట్లు తెలుస్తోంది.

రాబోయే రెండు నెలల్లో తెలుగు చిత్ర పరిశ్రమ(Tollywood)లో సందడి నెలకొననుంది. వరుసగా అటు అగ్ర హీరోలు, ఇటు యువ కథానాయకుల సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. సినిమా ప్రదర్శనల విషయంలో ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం నిర్మాతలకు నష్టం కలిగించేది ఉందనే అభిప్రాయం ఇండస్ట్రీలో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆన్‌లైన్‌ టికెట్ల విక్రయానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో టికెట్ల రూపంలో వచ్చిన డబ్బును నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్‌కు వీలైనంత త్వరగా ప్రభుత్వం ఇవ్వకపోతే వారు నష్టపోయే ప్రమాదం ఉందని సినీ పెద్దలు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో సీఎం జగన్‌తో నాగార్జున భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. సినిమాటోగ్రఫీ చట్టంలో మార్పులు, టికెట్‌ రేట్లు, బెనిఫిట్‌ షోలు తదితర అంశాలపై ఇరువురు చర్చించినట్లు తెలుస్తోంది.

సీఎం క్యాంపు కార్యాలయం నుంచి నాగార్జున నేరుగా గన్నవరం విమానాశ్రయానికి వెళ్లిపోయారు. అక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. ‘జగన్‌ నా శ్రేయోభిలాషి. ఆయనను చూసి చాలా రోజులవుతోంది. అందుకే విజయవాడకు వచ్చా. సీఎం జగన్‌తో కలిసి లంచ్‌ చేశా. విజయవాడ రావడం నాకు ఆనందంగా ఉంది’ అని వెళ్లిపోయారు. నాగార్జున వెంట నిర్మాతలు ప్రీతంరెడ్డి, నిరంజన్‌రెడ్డిలు ఉన్నారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని