Tanish: ఈడీ నోటీసులు ఇవ్వడం బాధించింది: తనీశ్‌ - telugu news hero tanish about drug and money laundering case
close
Published : 17/09/2021 01:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Tanish: ఈడీ నోటీసులు ఇవ్వడం బాధించింది: తనీశ్‌

హైదరాబాద్‌: డ్రగ్స్ కేసును 2017లోనే పూర్తి చేసిన అధికారులు.. ఈడీ పేరుతో మళ్లీ నోటీసులు జారీ చేయడం ఆవేదన కలిగించిందని యువ నటుడు తనీశ్‌ అన్నారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనకు మనీ ల్యాండరింగ్‌కు సంబంధించిన ప్రశ్నించేందుకు ఈడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. శుక్రవారం తనీశ్‌ ఈడీ ముందు విచారణకు హాజరుకానున్నాడు.

ఈ సందర్భంగా ఈటీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. ఈడీ అడిగే బ్యాంకు వివరాలన్నీ అందజేస్తానని తెలిపారు. తన ఆర్థిక పరిస్థితి ఏంటో తనకు పూర్తిగా తెలుసని, అధికారులకు అన్ని వివరాలు చెబుతానని పేర్కొన్నారు. డ్రగ్స్‌లో పట్టుబడిన కెల్విన్ అనే వ్యక్తితో తనకు ఎలాంటి పరిచయం లేదని ఈ సందర్భంగా తనీశ్‌ స్పష్టం చేశారు.

మరోవైపు ‘మా’ ఎన్నికల్లోనూ ప్రకాశ్‌రాజ్ గెలిస్తే చిత్ర పరిశ్రమకు మంచి జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గత కార్యవర్గంలో సభ్యుడిగా పోటీ చేస్తున్నప్పుడు తనను చాలా తక్కువ చేసి చూశారని ఆవేదన వ్యక్తం చేశారు. సభ్యుడిగా ఎన్నికైనా ఏం చేయాలేకపోయాననే అసంతృప్తి వెంటాడుతోందని  విచారం వ్యక్తం చేశారు.



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని