Sehari: సిధ్‌ శ్రీరామ్‌ కొత్త పాట.. ‘ఇది చాలా బాగుందిలే’  - telugu news idhi chala baagundhile sung by sid sriram
close
Published : 29/07/2021 13:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Sehari: సిధ్‌ శ్రీరామ్‌ కొత్త పాట.. ‘ఇది చాలా బాగుందిలే’ 

ఇంటర్నెట్‌ డెస్క్: ‘ఇది చాలా బాగుందిలే’ పాటతో మరోసారి తన మార్క్‌ చూపించారు ప్రముఖ గాయకుడు సిధ్‌ శ్రీరామ్‌. హర్ష్‌ కనుమిల్లి, సిమ్రన్‌ చౌదరి జంటగా తెరకెక్కుతోన్న ‘సెహరి’ చిత్రంలోని గీతమిది. ఈ మెలొడీని (లిరిలక్‌ వీడియో) తాజాగా విడుదల చేసింది చిత్రబృందం. కిట్టు విస్సాప్రగడ సాహిత్యం అందించగా ప్రశాంత్‌ ఆర్‌.విహారి స్వరాలు సమకూర్చారు. ఎప్పటిలానే తన మ్యాజికల్‌ స్వరంతో శ్రోతల హృదయాన్ని హత్తుకుంటున్నారు సిధ్‌. నాయకానాయికల హావభావాలు ఆకట్టుకుంటున్నాయి. హర్ష్‌ డ్యాన్సు అలరిస్తుంది. రొమాంటిక్‌ కామెడీ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రానికి జ్ఞానసాగర్‌ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు. జిష్ణురెడ్డి, శిల్పాచౌదరి నిర్మిస్తున్నారు. ఇటీవల చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే థియేటర్లలో సందడి చేయనుంది.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని