India Corona: మరోసారి పెరిగిన కొత్త కేసులు  - telugu news india corona update
close
Updated : 17/09/2021 12:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

India Corona: మరోసారి పెరిగిన కొత్త కేసులు 

ఆగ్నేయాసియా దేశాల్లో 100 కోట్ల డోసులు.. ఒక్క భారత్‌లోనే 77 కోట్లు

దిల్లీ: దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. వరుసగా రెండో రోజు 30 వేలకు పైనే కొత్త కేసులు వెలుగుచూశాయి. తాజాగా 12.5 శాతం మేర పెరిగి 34 వేలకు చేరాయి. ఈ మేరకు శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను వెలువరించింది.

24 గంటల వ్యవధిలో 34,403 మంది కరోనా బారినపడినట్లు తేలింది. మొత్తంగా మహమ్మారి సోకిన వారి సంఖ్య 3.33 కోట్లకు చేరగా.. 3.25 కోట్ల మందికిపైగా కోలుకున్నారు. నిన్న ఒక్కరోజే 37,950 మంది వైరస్‌ నుంచి బయపడ్డారు. ప్రస్తుతం 3,39,056 మంది కొవిడ్‌తో బాధడుతున్నారు. నిన్న 320 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. దీంతో  ఇప్పటివరకు 4.4 లక్షల మందికి పైగా చనిపోయారు.

వ్యాక్సిన్ సేవ చేద్దాం: మాండవీయ 
‘కరోనా టీకాలు వేయించుకొని, ఇతరులకు స్లాట్స్‌ బుక్ చేసి.. మీరు ప్రధాని నరేంద్రమోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం సంతోషంగా ఉంది. మనం టీకా తీసుకోవడంతో పాటు టీకా తీసుకునేలా ఇతరులను ప్రోత్సహించి వ్యాక్సిన్‌ సేవ చేద్దాం’ అంటూ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ అన్నారు. ఈ రోజు ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా టీకా తీసుకోవాల్సిన అవసరాన్ని మంత్రి మరోసారి గుర్తుచేశారు. టీకా తీసుకొని ప్రధానికి పుట్టినరోజు కానుక ఇద్దామని ఆయన నిన్న ట్విటర్ వేదికగా పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దేశంలో ఇప్పటివరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 77 కోట్ల మార్కును దాటింది.  

ఆ దేశాల్లో 100 కోట్ల డోసులు: డబ్ల్యూహెచ్‌ఓ

తమ పరిధిలోని ఆగ్నేయాసియా దేశాల్లో 100 కోట్ల డోసులు పంపిణీ అయినట్లు శుక్రవారం ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. మరోపక్క ఒక్క భారత్‌లోనే గరువారం సాయంత్రం వరకు 76 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయినట్లు తెలిపింది.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని