India Corona: ఊరటనిస్తోన్న గణాంకాలు.. 3 లక్షల దిగువకు క్రియాశీల కేసులు  - telugu news india corona update
close
Updated : 27/09/2021 12:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

India Corona: ఊరటనిస్తోన్న గణాంకాలు.. 3 లక్షల దిగువకు క్రియాశీల కేసులు 

కొత్త కేసులు, మరణాలు ఎన్నంటే..?

దిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోకి వస్తోంది. 30 వేల దిగువనే కొత్త కేసులు నమోదయ్యాయి. తాజా కేసులు తగ్గుతుండటంతో.. క్రియాశీల కేసుల సంఖ్య కూడా 3 లక్షల దిగువకు పడిపోయింది. మృతుల సంఖ్య 300 లోపే నమోదైంది. సోమవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెలువరించిన ఈ గణాంకాలు కాస్త ఊరట కలిగిస్తున్నాయి.

నిన్న 11,65,006 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 26,041 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. కేరళలో 15,951, మహారాష్ట్రలో 3,206 కేసులు వెలుగుచూశాయి. తాజాగా మరో 29 వేల మంది కోలుకున్నారు. దాంతో మొత్తం కేసులు 3.36 కోట్లకు చేరగా..రికవరీలు 3.29 కోట్లకు పెరిగాయి. రికవరీ రేటు 97.78 శాతంగా ఉంది.

ప్రస్తుతం క్రియాశీల కేసులు మూడు లక్షల దిగువకు చేరాయి. ఈ కేసుల సంఖ్య 2.99 లక్షలు(0.89 శాతం)గా ఉంది. నిన్న 276 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. దాంతో గతేడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 4.47 లక్షల మంది కరోనా కాటుకు బలయ్యారు.

86 కోట్ల టీకా డోసులు.. దేశంలో కరోనా టీకా కార్యక్రమం వేగంగా సాగుతోంది. ఆదివారం సెలవు దినం కావడంతో పంపిణీ అయిన టీకా డోసుల సంఖ్య కాస్త తగ్గింది. నిన్న 38.18 లక్షల మంది టీకా వేయించుకున్నారు. ఇప్పటివరకు 86 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని