Jetty: ‘జెట్టి’.. మత్స్యకారుల జీవన ప్రయాణం - telugu news jetty trailer out now
close
Updated : 22/10/2021 07:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Jetty: ‘జెట్టి’.. మత్స్యకారుల జీవన ప్రయాణం

నందిత శ్వేతా, మాన్యం కృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘జెట్టి’. సుబ్రమణ్యం పిచ్చుక దర్శకుడు. కె.వేణు మాధవ్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమా త్వరలో తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే హీరో బాలకృష్ణ ట్రైలర్‌ విడుదల చేసి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. ‘‘ఓ మత్స్యకార గ్రామంలో జరిగిన ఘటనలను ఆధారంగా తీసుకొని ఈ చిత్రం నిర్మించాం. మత్స్యకారుల జీవన విధానాలను, వారి  కట్టుబాట్లను దర్శకుడు ఎంతో చక్కగా    చిత్రీకరించారు. ప్రస్తుతం నిర్మాణాంతర పనులు జరుగుతున్నాయి. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తామ’’న్నారు. సంగీతం: కార్తిక్‌ కొండకండ్ల, ఛాయాగ్రహణం: వీరమణి.



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని