Bigg Boss Telugu 5: హౌస్‌మేట్స్‌తో ఓ ఆటాడుకున్న నాగార్జున - telugu news latest promo of biggboss telugu 5
close
Published : 24/10/2021 15:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Bigg Boss Telugu 5: హౌస్‌మేట్స్‌తో ఓ ఆటాడుకున్న నాగార్జున

హైదరాబాద్‌: వారం మొత్తం గొడవలు, చర్చలతో వేడెక్కిన బిగ్‌బాస్‌ హౌస్‌ని వారాంతంలో నాగార్జున చల్లబరిచే ప్రయత్నం చేశారు. ఎలిమినేషన్‌లో భాగంగా ఈ వారం ఇంటిని విడిచి బయటకు ఎవరు వెళ్తారా? అని టెన్షన్‌లో ఉన్న ఇంటిసభ్యులతో నాగార్జున సరదాగా ఆటలు ఆడించారు. కొన్ని సరదా టాస్క్‌లు ఇచ్చి.. గెలుపొందిన హౌస్‌మేట్‌కి ఓ పవర్‌ఫుల్‌ బహుమతి ఇస్తానని ఆయన అన్నారు. ఇందులో భాగంగా కలర్‌ఫుల్‌ కుషన్‌ టాస్క్‌ ఇచ్చి.. ‘అడగండి, లాక్కోండి, దొంగిలించండి.. మీ ఇష్టం ఏదైనా చేయండి. కానీ, నేను చెప్పిన కుషన్‌ మాత్రం సంపాదించుకోండి’ అని నాగ్‌ చెప్పగానే ఇంటిసభ్యులందరూ తమకు కావాల్సిన కుషన్‌ కోసం పోటీ పడ్డారు. అనంతరం ‘మిసెస్‌ ప్రభావతి’ని మెప్పించమని నాగ్‌ సూచించడంతో.. ‘ప్లీజ్‌ బేబీ.. నీక్కూడా అన్నం తినిపిస్తా.. నిన్ను కొట్టను’ అంటూ అంటూ ఇంటిసభ్యులు ప్రయత్నించారు. మరి, నాగ్‌ ఇచ్చిన టాస్క్‌ల్లో విజయం సాధించి స్పెషల్‌ పవర్స్‌తో ఉన్న బహుమతి గెలుపొందేదెవరు? తక్కువ ఓట్లతో ఈ వారం ఇంటిని వీడేదెవరు? తెలియాలంటే ఈరోజు ఎపిసోడ్‌ చూడాల్సిందే.



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని