భీమ్లా నాయక్‌గా పవన్‌ వచ్చాడు.. సింగరాయ్‌గా నాని పూర్తి చేశాడు..! - telugu news latest updates of tollywood
close
Updated : 26/07/2021 15:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భీమ్లా నాయక్‌గా పవన్‌ వచ్చాడు.. సింగరాయ్‌గా నాని పూర్తి చేశాడు..!

టాలీవుడ్‌ లేటెస్ట్‌ అప్‌డేట్స్

ఇంటర్నెట్‌డెస్క్‌: కరోనా సెకండ్‌వేవ్‌ చాలా వరకూ తగ్గుముఖం పట్టడంతో సినీ పరిశ్రమలో పనులు వేగవంతమయ్యాయి. మరి కొన్నిరోజుల్లో థియేటర్లు పునః ప్రారంభమవుతుండటంతో కొన్ని సినిమాలు రిలీజ్‌లకు సిద్ధమవుతున్నాయి. మరికొన్ని ప్రాజెక్ట్‌లు షూటింగ్స్‌ పూర్తి చేసే పనిలో పడ్డాయి. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం రెండు క్రేజీ ప్రాజెక్ట్‌లకు సంబంధించిన లవ్లీ అప్‌డేట్స్‌ ప్రేక్షకుల్ని ఫిదా చేశాయి.. ఇంతకీ అవేమిటంటే..

భీమ్లానాయక్‌ ఆన్‌ డ్యూటీ

పవన్‌కల్యాణ్‌-రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో ఓ సరికొత్త చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నిర్మితమవుతోన్న ఈ చిత్రానికి సాగర్‌ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా వాయిదా పడిన ఈ సినిమా షూట్‌ సోమవారం తిరిగి పట్టాలెక్కింది. ఇందులో పవన్‌-రానాలపై యాక్షన్‌ సీక్వెన్స్‌ తెరకెక్కించనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ నెటిజన్ల టీజ్‌ చేసే విధంగా చిత్రబృందం ఓ పిక్‌ని షేర్‌ చేసింది. ఇందులో పవన్‌కల్యాణ్‌ పోలీస్‌ దుస్తుల్లో వెనుక నుంచి కనిపించారు. ‘భీమ్లానాయక్‌ ఆన్‌ డ్యూటీ’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ మేరకు పవన్‌ పాత్ర పేరు ‘భీమ్లానాయక్‌’ అని అర్థమవుతోంది. మలయాళంలో సూపర్‌హిట్‌ విజయాన్ని అందుకున్న ‘అయ్యప్పనుమ్‌ కోషియం’ రీమేక్ ఈ సినిమా వస్తోన్న విషయం విదితమే.


సింగరాయ్‌ పూర్తి చేసేశాడు..!

యువ కథానాయకుడు నాని ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘శ్యామ్‌ సింగరాయ్‌’. రాహుల్‌ సాంకృత్యాన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాయిపల్లవి, కృతిశెట్టి కథానాయికలుగా కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్‌ సోమవారంతో పూర్తయ్యింది. ఈ విషయాన్ని నాని ట్విటర్‌ వేదికగా తెలియజేశారు. నిర్మాణాంతర పనులు ప్రారంభించినట్లు తెలిపారు. త్వరలోనే థియేటర్లలో ఈ సినిమా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.


మల్టీ స్టారర్‌ - ఖిలాడీ మొదలయ్యాయి

కథానాయికలు రెజీనా-నివేదా థామస్‌ ప్రధాన పాత్రల్లో ఓ సరికొత్త యాక్షన్‌ కామెడీ సినిమా సిద్ధమవుతోంది. కొరియన్‌ సినిమా ‘మిడ్‌నైట్‌ రన్నర్స్‌’ను ఆధారంగా చేసుకుని ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. సుధీర్‌ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూట్‌ పునఃప్రారంభమైందని చిత్ర నిర్మాణ సంస్థ ట్వీట్‌ చేసింది. మరోవైపు, రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ‘ఖిలాడి’ షూట్‌ కూడా పట్టాలెక్కింది. రమేష్‌ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూట్‌ చాలా వరకూ పూర్తయ్యింది.
మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని