Most Eligible Bachelor: 4 మిలియన్ల హృదయాల్ని మీటిన ‘లెహరాయీ’ - telugu news leharaayi song trending on youtube
close
Updated : 21/09/2021 08:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Most Eligible Bachelor: 4 మిలియన్ల హృదయాల్ని మీటిన ‘లెహరాయీ’

ఇంటర్నెట్ డెస్క్‌: అఖిల్‌ అక్కినేని, పూజా హెగ్డే జంటగా రూపొందుతోన్న చిత్రం ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’. బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకుడు. ఈ సినిమాలోని ‘లెహరాయి’ అనే రొమాంటిక్‌ గీతం ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. విడుదలైన అనతి కాలంలోనే యూట్యూబ్‌లో ఈ పాట రికార్డు దిశగా దూసుకెళ్తోంది. సెప్టెంబరు 15న సంగీత ప్రపంచంలోకి వచ్చిన ఈ లిరికల్‌ వీడియోకి ఇప్పటి వరకు 4 మిలియన్‌కి పైగా వ్యూస్‌ దక్కాయి. దీనిపై చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేసింది. గోపీ సుందర్‌ సంగీతం అందించిన ఈ గీతాన్ని శ్రీమణి రచించారు. సిధ్ శ్రీరామ్‌ ఆలపించారు. ఈ పాటలోని అఖిల్‌, పూజా హెగ్డే కెమిస్ట్రీ యువతని బాగా ఆకట్టుకుంటోంది. గీతా ఆర్ట్స్‌ 2 పతాకంపై బన్నీ వాసు, వాసువర్మ నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్‌ 8న ప్రేక్షకుల ముందుకురానుంది.



Advertisement


మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని