PelliSandaD: పెళ్లి సందD.. పాట విడుదల చేసిన రవితేజ - telugu news madhura nagarilo song from pelli sandad launched by raviteja
close
Updated : 01/10/2021 07:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

PelliSandaD: పెళ్లి సందD.. పాట విడుదల చేసిన రవితేజ

హైదరాబాద్‌: శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ కథానాయకుడిగా వెండితెరపై సందడి చేయనున్న చిత్రం ‘పెళ్లి సందD’. గౌరీ రోణంకి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రోషన్‌కు జోడీగా శ్రీలీల నటించారు. దసరా కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో బుధవారం ఈ సినిమా నుంచి ‘మధురా నగరిలో’ అంటూ సాగే పాటను నటుడు రవితేజ విడుదల చేశారు. శ్రీనిధి, నారాయణ నాయర్‌, కాలభైరవ ఈ పాటను ఆలపించారు.

శ్రీకాంత్‌-దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో విడుదలైన సూపర్‌హిట్‌ చిత్రం ‘పెళ్లి సందడి’కి సీక్వెల్‌గా ఈ సినిమా రానుంది. ఈ సినిమాతో రాఘవేంద్రరావు నటుడిగా వెండితెరపై సందడి చేయనున్నారు. లవ్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో రావురమేశ్‌, ప్రకాశ్‌రాజ్‌, ఝాన్సీ, హేమ, తదితరులు కీలకపాత్రలు పోషించారు. కీరవాణి స్వరాలు అందించారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని