MaheshBabu: సుమంత్‌ కొత్త సినిమా.. మహేశ్‌ ప్లే లిస్ట్‌లో అలోన్‌ సాంగ్‌ - telugu news maheshbabu liked alone alone song
close
Published : 19/09/2021 14:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

MaheshBabu: సుమంత్‌ కొత్త సినిమా.. మహేశ్‌ ప్లే లిస్ట్‌లో అలోన్‌ సాంగ్‌

హైదరాబాద్‌: ‘విడాకులు తర్వాత జీవితం ఎలా ఉంటుంది?’ అనే విభిన్నమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కిన కుటుంబ కథా చిత్రం ‘మళ్ళీ మొదలైంది’. సుమంత్‌ కథానాయకుడు. నైనా గంగూలీ కథానాయిక. ఈ చిత్రానికి కీర్తి కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ‘అలోన్‌ అలోన్‌’ అనే పాటను చిత్రబృందం ఆదివారం విడుదల చేసింది. అనూప్‌ రూబెన్స్‌ మ్యూజిక్‌ కంపోజిషన్‌లో సిద్ద్‌ శ్రీరామ్‌ ఆలపించిన ఈ పాట తనకెంతగానో నచ్చిందని.. తన ప్లే లిస్ట్‌లోకి చేరిన కొత్త పాట ఇదేనని మహేశ్‌ తెలిపారు. నిఖిల్, దుల్కర్‌ సల్మాన్‌ కూడా ఈ పాట తమకెంతగానో నచ్చిందని.. సినిమా విజయం సాధించాలని కోరుకున్నారు. రెడ్‌ సినిమాస్‌ బ్యానర్‌పై కె. నాగేశ్వరరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని