Mammootty: బార్బర్‌ కొడుకు ముఖ్యమంత్రి అయితే? - telugu news mammootty one movie telugu trailer
close
Published : 27/07/2021 14:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Mammootty: బార్బర్‌ కొడుకు ముఖ్యమంత్రి అయితే?

ఇంటర్నెట్‌ డెస్క్‌: రాజకీయ నేపథ్యంలో ప్రముఖ నటుడు మమ్ముట్టి నటించిన మలయాళీ చిత్రం ‘వన్‌’. సంతోష్‌ విశ్వనాథ్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మలయాళీ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పుడు తెలుగు వారిని అలరించేందుకు సిద్ధమవుతోంది. ప్రముఖ ఓటీటీ ‘ఆహా’లో జులై 30 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సందర్భంగా తెలుగు ట్రైలర్‌ విడుదలైంది. ఇందులో తెలంగాణ ముఖ్యమంత్రి కల్లూరి చంద్రం పాత్రలో కనిపించారు మమ్ముట్టి. సీఎంగా ఆయన నటన, గెటప్‌ ఆకట్టుకుంటున్నాయి. అధికార పార్టీ, ప్రతిపక్షాల మధ్య సాగే సంభాషణలు మెప్పిస్తున్నాయి. ‘ఒక బార్బర్‌ కొడుకు ముఖ్యమంత్రి అయితే.. ఇదుగో ఇలాగే ఉంటుంది’, ‘మనలాంటి వాళ్లని తిట్టినా.. పడేసి కొట్టినా ఎవరూ పట్టించుకోరు’ తదితర డైలాగులు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. మరి కల్లూరి చంద్రం ముఖ్యమంత్రిగా ఎలా మారారు? ఆయన ప్రస్థానం ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. మురళీ గోపీ, జార్జ్‌, గాయత్రి అరుణ్‌, ఇషానీ కృష్ణ తదితరులు నటించిన ఈ సినిమాకి బాబీ, సంజయ్‌ కథ అందించారు. గోపీ సుందర్‌ స్వరాలు సమకూర్చారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని