Manchu manoj: మహిళకు ఎక్కడ అన్యాయం జరిగినా జాతికి అవమానమే - telugu news manchu manoj urges every one to stand for woman safety
close
Published : 17/09/2021 17:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Manchu manoj: మహిళకు ఎక్కడ అన్యాయం జరిగినా జాతికి అవమానమే

హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న అకృత్యాలకు వ్యతిరేకంగా అందరూ కలిసి పోరాటం చేయాలని నటుడు మంచు మనోజ్‌ అన్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా మహిళల భద్రత కోసం ప్రతిఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం మనోజ్‌ ఓ ట్వీట్‌ పెట్టారు.

‘‘ఇది ఒక రాష్ట్ర సమస్య కాదు. దేశ సమస్య. మహిళకు అన్యాయం ఎక్కడ జరిగినా జాతికి అవమానమే. భవిష్యత్తులో ఇలాంటి ఘోరమైన ఘటనలు జరగకుండా ఉండేందుకు అందరూ ఒక్కటిగా పోరాటం చేద్దాం. రాజకీయ పార్టీలు, అజెండాలు, రాష్ట్రాలు, భాషలు.. వీటికి అతీతంగా మహిళల భద్రత కోసం పోరాటం కొనసాగిద్దాం. ఇటీవల ఓ రాజకీయ పార్టీకి చెందిన ఫాలోవర్స్ నుంచి ఎక్కువగా నెగెటివ్ కామెంట్స్ రావడం చూశాను. మీకిష్టమైన రాజకీయ పార్టీ కోసం కాకుండా మహిళల రక్షణ గురించి ఆలోచించండి. మన ఇంటి ఆడబిడ్డలకు మెరుగైన సమాజాన్ని సిద్ధం చేద్దాం. ‘ఒక్కరి కోసం అందరూ.. అందరి కోసం ఒక్కరూ.. కలిసి ఉంటేనే నిలబడగలం’’ అని మనోజ్‌ పేర్కొన్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని