MAA Elections: ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌ రాజీనామా చేయడం దురదృష్టకరం: మంచు విష్ణు - telugu news manchu vishnu comments on prakash raj pannel in oath taking ceremony
close
Updated : 16/10/2021 16:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

MAA Elections: ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌ రాజీనామా చేయడం దురదృష్టకరం: మంచు విష్ణు

హైదరాబాద్‌: మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్(మా) అభివృద్ధికి తాను అన్నివిధాలా కష్టపడతానని నటుడు మంచు విష్ణు అన్నారు. ఇటీవల జరిగిన ‘మా’ ఎన్నికల్లో హోరాహోరీగా తలపడి.. ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌పై ఆయన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ‘మా’ నూతన అధ్యక్షుడిగా ఆయన శనివారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తన మేనిఫెస్టోలో చర్చించిన ప్రతిదీ అమలు జరిగేలా తాను కృషి చేస్తానన్నారు. ‘మా’ అభివృద్ధి కోసం అందరూ కలిసి కట్టుగా పనిచేయాలని సూచించారు.

‘‘హోరాహోరీగా జరిగిన ‘మా’ ఎన్నికల్లో మేము గెలిచాం. ప్రత్యర్థి ప్యానెల్‌ వాళ్లు దాన్ని గౌరవించాలి. ‘మా’ అభివృద్ధికి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలనే దానిపై వాళ్ల సలహాలు కూడా తీసుకుంటాను. ఆ విషయంలో ప్రత్యర్థి ప్యానెల్‌లోని వాళ్లూ నాకు సపోర్ట్‌ చేయాలని కోరుకుంటున్నాను. ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం వారి కారణాల వల్ల తమ పదవులకు ప్రత్యర్థి ప్యానెల్‌లోని సభ్యులు రాజీనామా చేశారు. అది చాలా దురదృష్టకరం. కానీ, మేము ‘మా’ అభివృద్ధి కోసం పాటుపడతాం. ఎన్నికల సమయంలో నాకెంతో సపోర్ట్‌ చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఇకపై నేను కానీ నా టీమ్‌లోని సభ్యులు కానీ ‘మా’ ఎన్నికల వ్యవహరంపై మీడియాలో మాట్లాడము. కేవలం మేము చేయబోయే కార్యక్రమాల గురించే మాట్లాడతాం’ అని మంచు విష్ణు వివరించారు.



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని