MAA Elections: తన ప్యానల్‌ని ప్రకటించనున్న విష్ణు! - telugu news manchu vishnu will reveal his panel maa elections
close
Updated : 22/09/2021 19:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

MAA Elections: తన ప్యానల్‌ని ప్రకటించనున్న విష్ణు!

ఇంటర్నెట్‌ డెస్క్‌: మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల అంశం గతకొంతకాలంగా హాట్‌ టాపిక్‌గా నిలుస్తోంది. ఈ ఎన్నికపై ఎప్పుడూ లేనంతగా చర్చ సాగుతోంది. అక్టోబర్‌ 10న జరగనున్న ఈ ఎన్నికల కోసం అధ్యక్ష అభ్యర్థులుగా మంచు విష్ణు, ప్రకాశ్‌రాజ్‌ బరిలో దిగిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రకాశ్‌రాజ్‌ తన ప్యానల్‌ని ప్రకటించారు. సెప్టెంబరు 23న విష్ణు తన ప్యానల్‌ సభ్యుల వివరాల్ని వెల్లడించనున్నారని సమాచారం. ‘మా’కి ప్రత్యేక భవనం ఎజెండాతో రాబోతున్న విష్ణు.. తన ప్యానల్‌లో ఎవరికి అవకాశం ఇస్తారోనని అటు చిత్ర పరిశ్రమలో, ఇటు సినీ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. మరోవైపు, జనరల్‌ సెక్రటరీ పదవి కోసం ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌ నుంచి జీవిత పోటీ పడతుండగా, బండ్ల గణేశ్‌ స్వతంత్రంగా పోటీ చేస్తున్నారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని