‘పొన్నియిన్‌ సెల్వన్‌’.. తొలి భాగం వచ్చే ఏడాది - telugu news maniratnam film ponniyin selvan release in next year
close
Published : 19/07/2021 20:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘పొన్నియిన్‌ సెల్వన్‌’.. తొలి భాగం వచ్చే ఏడాది

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ దర్శకుడు మణిరత్నం భారీ తారాగణంతో తెరకెక్కిస్తోన్న చిత్రం ‘పొన్నియిన్‌ సెల్వన్‌’. విజువల్‌ ప్రధానంగా రూపొందుతోన్న ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తొలిభాగాన్ని 2022లో విడుదల చేస్తున్నట్టు తాజాగా ప్రకటించాయి చిత్ర నిర్మాణ సంస్థలు లైకా ప్రొడక్షన్స్‌,  మద్రాస్‌ టాకీస్‌. ఈ మేరకు ఓ ఫొటోని విడుదల చేశాయి. పులి బొమ్మ ఉన్న ఆయుధాలు, ‘పీఎస్‌- 1’ అనే లోగోతో ఈ పోస్టర్‌ని రూపొందించారు. ప్రసిద్ధ రచయిత కల్కి రాసిన ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ నవల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందుతోంది. శరవేరంగా షూటింగ్‌ జరుగుతోంది. అన్ని భాషలకు చెందిన అగ్ర తారలు ఇందులో నటిస్తున్నారు. అయితే ఆ నటీనటుల వివరాల్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు చిత్ర బృందం. ఐశ్వర్య రాయ్‌, విక్రమ్‌, జయం రవి, కీర్తి సురేశ్‌, మోహన్‌ బాబు తదితరుల పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. సుభాస్కరన్‌ సమర్పణలో మణిరత్నం నిర్మిస్తోన్న ఈ చిత్రానికి సంగీతం: ఎ.ఆర్‌. రెహమాన్‌, ఛాయాగ్రహణం: ఎస్‌. రవి వర్మన్‌, కూర్పు: అక్కినేని శ్రీకర్‌ ప్రసాద్‌, కళ: తోట తరణి.మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని