Dear Megha: లవ్‌లో పీహెచ్‌డీ చేశా: మేఘ - telugu news megha akash starer dear megha teaser out
close
Published : 22/07/2021 12:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Dear Megha: లవ్‌లో పీహెచ్‌డీ చేశా: మేఘ

ఆకట్టుకునేలా ‘డియర్‌ మేఘ’ టీజర్‌

హైదరాబాద్‌: ‘హాయ్‌ నేను మేఘా స్వరూప్‌. నాకు లవ్‌లో పీహెచ్‌డీ ఉంది’ అని అంటున్నారు నటి మేఘా ఆకాశ్‌. ఆమె, అదిత్‌ అరుణ్‌ జంటగా నటించిన యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ‘డియర్‌ మేఘ’. సుశాంత్‌ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ‘డియర్‌ మేఘ’ టీజర్‌ను చిత్రబృందం నెటిజన్లతో పంచుకుంది. ‘అతి ఎక్కువ సంతోషనికైనా, అతి ఎక్కువ బాధకైనా కారణం ప్రేమే అవుతుంది. ఒక అమ్మాయి ప్రపంచంలో ఉన్న మిగతా అమ్మాయిలందర్నీ మర్చిపోయేలా చేసింది’ అంటూ అదిత్‌ అరుణ్‌ చెప్పిన డైలాగులు ఆకట్టుకునేలా ఉన్నాయి. మేఘ ఆకాశ్‌ హావభావాలు, అదిత్‌ అరుణ్‌ నటన అందర్నీ ఆకర్షించేలా ఉంది. వేదాన్ష్‌ క్రియేటివ్‌ వర్క్స్‌ బ్యానర్‌పై అర్జున్ ఈ చిత్రాన్ని నిర్మించారు. గౌర హరి స్వరాలు సమకూర్చారు.




మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని