Niranjan reddy: ప్రతి విజయం వెనుక కష్టం ఉంటుంది: నిరంజన్‌రెడ్డి - telugu news minister singireddy niranjan reddy speaking on rural youth empowerment
close
Published : 25/09/2021 01:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Niranjan reddy: ప్రతి విజయం వెనుక కష్టం ఉంటుంది: నిరంజన్‌రెడ్డి

హైదరాబాద్: ప్రతి విజయం వెనుక కష్టం తప్పకుండా ఉంటుందని.. ఏ రంగంలోనైనా కష్టపడితేనే మంచి గుర్తింపు లభిస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లోని స్వర్ణ భారత్‌ ట్రస్ట్‌లో టీఎస్ అగ్రోస్ సంస్థ సహకారంతో మేనేజ్ సంస్థ ద్వారా వ్యవసాయ అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు యువ వ్యవసాయ పట్టభద్రులకు 45 రోజులపాటు శిక్షణ విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా శిక్షణ పూర్తి చేసుకున్న 30 మంది అభ్యర్థులకు ఒక్కొక్కరికి నాబార్డు, ఎస్‌బీఐ సహకారంతో 36 శాతం రాయితీపై రూ.10 లక్షల చొప్పున మంత్రి చేతుల మీదుగా అందజేశారు. శిక్షణ ధ్రువపత్రాలను కూడా అందించారు. ఈ కార్యక్రమంలో టీఎస్ ఆగ్రోస్ సంస్థ ఎండీ కె.రాములు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

‘‘గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయంలో రైతుల ఇబ్బందులు తీర్చడంలో ఆగ్రోస్ సేవా కేంద్రాల నిర్వాహకులు నిబద్ధతతో పనిచేయాలి. వివిధ అవసరాల రీత్యా దుకాణాల వద్దకు వచ్చే రైతులు, వినియోగదారులతో స్నేహపూర్వకంగా మెలగాలి. గ్రామీణ ప్రాంతాల్లో గతానికి, ఇప్పటికి ప్రజల అవసరాలు మారిపోయాయి. పట్టణీకరణతో నగర జీవితంలో ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో మళ్లీ గ్రామీణ జీవనం విస్తరిస్తేనే ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. గ్రామాల్లో ప్రజల అవసరాలను గుర్తించి వ్యాపారాలను ప్రణాళికాబద్ధంగా ఏర్పాటు చేసుకోవాలి. దేశంలో తొలిసారి వినూత్న రీతిలో ఇచ్చిన అగ్రోస్ శిక్షణను సద్వినియోగం చేసుకొని జీవితంలో స్థిరపడాలి. రైతులకు నాణ్యమైన సేవలు, నాణ్యమైన రసాయన ఎరువులు, పురుగు మందులు, సేంద్రీయ ఎరువులు, విత్తనాలు, ఇతర వస్తువులు అందిస్తామనే నమ్మకం కలిగించాలి. సృజనాత్మకతతో కొంచెం కొత్తగా ఆలోచిస్తే వ్యాపారంలో రాణించడం సులభతరం అవుతుంది’’ అని నిరంజన్‌ రెడ్డి అన్నారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని