‘మిషన్‌ ఇంపాజిబుల్‌’లో మలయాళీ నటుడు - telugu news mission impossible team welcomes actor hareesh peradi
close
Published : 04/08/2021 15:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘మిషన్‌ ఇంపాజిబుల్‌’లో మలయాళీ నటుడు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ'తో విజయాన్ని అందుకున్న దర్శకుడు స్వరూప్‌.ఆర్‌.ఎస్‌.జె. ప్రస్తుతం 'మిషన్‌ ఇంపాజిబుల్‌' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నిరంజన్‌రెడ్డి, అన్వేష్‌రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులోని ఓ కీలక పాత్ర కోసం మలయాళీ నటుడు హరీశ్‌ని ఎంపిక చేసినట్టు చిత్ర బృందం సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటించింది. ప్రతి పాత్రలోనూ వైవిధ్యం ప్రదర్శించగల నటుడిగా హరీశ్‌కి పేరుంది. ఆయన ఎక్కువగా మలయాళం, తమిళం చిత్రాల్లో నటించారు. ‘గ్యాంగ్‌స్టర్‌’, ‘పులిమురుగన్‌’, ‘మెర్సల్‌’, ‘ఖైదీ’, ‘సుల్తాన్‌’ తదితర సినిమాలతో మెప్పించారు. మహేశ్‌ బాబు కథానాయకుడిగా ఎ.ఆర్‌. మురుగదాస్‌ తెరకెక్కించిన ద్విభాషా చిత్రం ‘స్పైడర్‌’తో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించారాయన. తొలిసారి నేరుగా తెలుగు చిత్రంలో నటించబోతున్నారు.  ఈ సినిమాలో నాయిక తాప్సీ ముఖ్య పాత్రలో నటిస్తోంది. విభిన్న కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: దీపక్‌ యరగర, సంగీతం: మార్క్‌ కె.రాబిన్‌, కూర్పు: రవితేజ గిరిజల, కళ: నాగేంద్ర.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని