Most Eligible Bachelor: మరోసారి వాయిదా పడిన అఖిల్‌ సినిమా.. కొత్త రిలీజ్‌ ఎప్పుడంటే..? - telugu news most eligible bachelor release postponed
close
Published : 26/09/2021 13:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Most Eligible Bachelor: మరోసారి వాయిదా పడిన అఖిల్‌ సినిమా.. కొత్త రిలీజ్‌ ఎప్పుడంటే..?

హైదరాబాద్‌: అక్కినేని అఖిల్‌ కథానాయకుడిగా నటించిన యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌ ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’. కరోనా కారణంగా ఇప్పటికే పలుమార్లు వాయిదాపడిన ఈ సినిమా విడుదల ఇప్పుడు మరోసారి ఆలస్యం కానుంది. ఈ మేరకు అక్టోబర్‌ 8న విడుదల కావాల్సిన చిత్రాన్ని దసరా కానుకగా ఆ నెల 15న విడుదల చేయనున్నట్లు ఆదివారం చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌ తెరకెక్కించిన ఈ సినిమాలో అఖిల్‌ లవర్‌బాయ్ లుక్‌లో కనిపించారు. హీరోయిన్‌గా పూజాహెగ్డే సందడి చేశారు. ఇప్పటికే విడుదలైన ఈసినిమా ప్రచార చిత్రాలు, పాటలు ప్రేక్షకుల్ని ఎంతగానో మెప్పించాయి. జీఏ2 ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీవాసు ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. గోపీ సుందర్‌ స్వరాలు అందిస్తున్నారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని