Dhee 13: ‘పరేషాన్‌’ అంటూ మరోసారి ఫిదా చేస్తోన్న నైనిక! - telugu news nainika performance in dhee
close
Published : 16/09/2021 23:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Dhee 13: ‘పరేషాన్‌’ అంటూ మరోసారి ఫిదా చేస్తోన్న నైనిక!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈటీవీలో ప్రసారమవుతున్న ‘ఢీ 13’ కార్యక్రమం వేదికగా ‘లాహే లాహే’ (ఆచార్య) పాటకి నృత్యం చేసి బుల్లితెర ప్రేక్షకుల్ని విశేషంగా అలరించింది నైనిక. ఇప్పుడు ‘పరేషానురా.. పరేషానురా’ (ధ్రువ) గీతంతో మరోసారి తన డ్యాన్సు పవర్‌ని చూపించనుంది. ఆ హంగామాకి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఈ పాటలో నైనా ఇచ్చిన రొమాంటిక్‌ ఎక్స్‌ప్రెషన్లు అందరినీ ఆకర్షించేలా ఉన్నాయి. ఆమె పర్ఫామెన్స్‌కి ఈ షో న్యాయ నిర్ణేతలు, టీమ్‌ లీడర్లు ఫిదా అయిపోయారు. తనని ఎంతోగానే మెప్పించడంతో నైనికని బాలీవుడ్‌ నటి మాధురీ దీక్షిత్‌తో పోల్చారు న్యాయ నిర్ణేతల్లో ఒకరైన గణేశ్‌ మాస్టర్. మరోవైపు.. క్వీన్స్‌ టీమ్‌లోని ఓ కంటెస్టెంట్‌ ‘మేఘం కరిగెను’ (నాగ) పాటకి, కింగ్స్‌ టీమ్‌లోని ఓ కంటెస్టెంట్‌ ‘మగధీర’ థీమ్‌కి డ్యాన్సు చేసి వావ్‌ అనిపిస్తున్నారు. ఎప్పటిలానే షో వ్యాఖ్యాత ప్రదీప్, కింగ్స్‌ టీమ్‌ లీడర్లు సుధీర్‌, ఆది, క్వీన్స్‌ టీమ్‌ లీడర్లు రష్మి, దీపికా నవ్వులు పంచుతున్నారు. వీటన్నింటినీ చూడాలంటే సెప్టెంబరు 22 వరకు ఆగాల్సిందే. అప్పటి వరకు ప్రోమోతో ఆనందించండి..  




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని