Hero: రానా చేతుల మీదగా ‘హీరో’ పాట - telugu news new song from hero movie out now
close
Updated : 25/10/2021 16:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Hero: రానా చేతుల మీదగా ‘హీరో’ పాట

హైదరాబాద్‌: తెదేపా ఎంపీ గల్లా జయదేవ్‌ కుమారుడు అశోక్‌ కథానాయకుడిగా వెండితెరకు పరిచయమవుతోన్న చిత్రం ‘హీరో’. నిధి అగర్వాల్‌ కథానాయిక. యాక్షన్‌, లవ్ ఎంటర్‌టైనర్‌గా సిద్ధమవుతోన్న ఈ చిత్రానికి శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఓ సరికొత్త పాట విడుదలైంది. ‘అచ్చ తెలుగందమే’ అంటూ సాగే ఈ పాటను సిద్ధ్‌ శ్రీరామ్‌ ఆలపించారు. లవ్‌, ఫీల్‌గుడ్‌ సాంగ్‌గా రూపుదిద్దుకున్న ఈ పాటను నటుడు రానా సోషల్‌మీడియా వేదికగా షేర్‌ చేశారు. ‘హీరో’ చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. అమరరాజా మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై పద్మావతి గల్లా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జిబ్రాన్‌ స్వరాలు అందిస్తున్నారు.




Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని