No Time To Die: జేమ్స్‌బాండ్‌ త్రీడీలో! - telugu news no time to die in 3d in india and china only
close
Published : 25/09/2021 10:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

No Time To Die: జేమ్స్‌బాండ్‌ త్రీడీలో!

జేమ్స్‌బాండ్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న జేమ్స్‌బాండ్‌ చిత్రం ‘నో టైమ్‌ టు డై’. డేనియల్‌ క్రేగ్‌ బాండ్‌గా నటించిన ఈ చిత్రం ఈ నెల 30న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమాని త్రీడీలో విడుదల చేయబోతున్నట్టు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా త్రీడీలో విడుదల చేయడానికి ఇబ్బందులు లేకపోయినా మనదేశంలో ఈ విషయంలో ఇంకా చర్చలు నడుస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్న వార్నర్‌ బ్రదర్స్‌ సంస్థకి, మల్టీప్లెక్స్‌ నిర్వాహకులకు మధ్య చర్చలు సాగుతున్నాయి. త్రీడీ చిత్రం కోసం ప్రేక్షకుల నుంచి వసూలు చేసే మొత్తంలో కొంత వార్నర్‌ బ్రదర్స్‌కి ఇవ్వాలని ఆ సంస్థ డిమాండ్‌ చేసినట్లు తెలుస్తోంది. కానీ మల్టీప్లెక్స్‌ నిర్వాహకులు అందుకు అంగీకరించలేదట. గతంలోనూ పలు హాలీవుడ్‌ చిత్రాల విషయంలో ఇదే సమస్య ఎదురైంది. ఆయా చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా త్రీడీలో విడుదలైనా మన దేశంలో టుడీలోనే ప్రేక్షకుల ముందుకొచ్చాయి. అన్నీ అనుకున్నట్టు జరిగితే భారతీయ ప్రేక్షకులు బాండ్‌ సినిమాని త్రీడీలో చూసే అవకాశం దక్కుతుంది.

భారీస్థాయి విడుదల

కరోనా నెమ్మదించి థియేటర్లు తెరచుకున్నాకా విడుదలైన ‘షాంఘ్‌ ఛీ’, ‘ది లెజెండ్‌ ఆఫ్‌ ది టెన్‌ రింగ్స్‌’ చిత్రాలకు మనదేశంలో మంచి ఆదరణ లభించడంతో ‘నో టైమ్‌ టు డై’ చిత్రాన్ని భారీస్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా సుమారు 1700 స్క్రీన్లలో ఈ సినిమా ప్రదర్శితమయ్యే అవకాశలున్నాయి. అక్టోబరు 1 తర్వాత మహారాష్ట్రలో థియేటర్లు పూర్తిస్థాయిలో తెరచుకుంటే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని