Venkatesh: మరో సర్‌ప్రైజ్‌ ఇచ్చిన ‘నారప్ప’ - telugu news o narappa lyrical video released starring venkatesh and priyamani
close
Published : 16/07/2021 17:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Venkatesh: మరో సర్‌ప్రైజ్‌ ఇచ్చిన ‘నారప్ప’

ఇంటర్నెట్‌ డెస్క్‌: తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రాల్లో ‘నారప్ప’ ఒకటి. వెంకటేశ్‌ కథానాయకుడిగా శ్రీకాంత్‌ అడ్డాల తెరకెక్కించిన చిత్రమిది. ప్రియమణి నాయిక. జులై 20 నుంచి ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ట్రైలర్‌, ‘చలాకీ చిన్నమ్మి’ పాటల్ని విడుదల చేసిన చిత్ర బృందం తాజాగా మరో సర్‌ప్రైజ్‌ని అందించింది. ‘ఓ.. నారప్ప’ అంటూ సాగే గీతాన్ని (లిరికల్‌ వీడియో) విడుదల చేసింది. అనంత శ్రీరామ్‌ రచించిన ఈ పాటని ధనుంజయ్‌, వరం ఆలపించారు. మణిశర్మ సంగీతం అందించారు. వెంకటేశ్‌, అమ్ము అభిరామి మధ్య తెరకెక్కించిన గీతమిది. ఈ సినిమాలో వెంకటేశ్‌ రెండు విభిన్న పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. యువకుడి పాత్రకి జోడీగా అభిరామి నటించింది. తమిళంలో సూపర్‌హిట్‌గా నిలిచిన ‘అసురన్‌’కి రీమేక్‌గా రూపొందింది ఈ చిత్రం. కార్తీక్‌ రత్నం, రాజీవ్‌ కనకాల తదితరులు కీలక పాత్రలు పోషించారు. వి క్రియేషన్స్‌ పతాకంపై కలైపులి ఎస్‌. థాను సమర్పణలో సురేశ్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై సురేశ్‌ బాబు ఈ చిత్రాన్ని నిర్మించారు. మాతృకకి దీటుగా ఈ సినిమాని తెరకెక్కించినట్టు ప్రచార చిత్రాన్ని చూస్తే అర్థమవుతుంది.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని