Rajinikanth: రజనీకాంత్‌ అభిమానులకి వెంకటేశ్‌ సర్‌ప్రైజ్‌.. ‘పెద్దన్న’ టీజర్‌ అదిరింది! - telugu news peddhanna teaser released by venkatesh starring rajinikanth nayanthara
close
Published : 23/10/2021 17:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Rajinikanth: రజనీకాంత్‌ అభిమానులకి వెంకటేశ్‌ సర్‌ప్రైజ్‌.. ‘పెద్దన్న’ టీజర్‌ అదిరింది!

ఇంటర్నెట్‌ డెస్క్: రజనీకాంత్‌ హీరోగా తెరకెక్కుతోన్న తమిళ చిత్రం ‘అన్నాత్తే’. శివ దర్శకుడు. నయనతార కథానాయిక. ఈ చిత్రం తెలుగులో ‘పెద్దన్న’ పేరుతో విడుదలకానుంది. దీపావళి కానుకగా నవంబరు 4 నుంచి థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా టాలీవుడ్‌ నటుడు వెంకటేశ్‌ టీజర్‌ని విడుదల చేశారు. రజనీకాంత్‌ అభిమానులు కోరుకునే అన్ని అంశాలను మేళవించి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు టీజర్‌ చూస్తే అర్థమవుతుంది. రజనీకాంత్‌ లుక్స్‌, నటన ఆకట్టుకునేలా ఉన్నాయి. ‘ఉప్పెనరా.. వాడికి అడ్డూ లేదు.. ఒడ్డూ లేదు’ అనే డైలాగ్‌ అలరిస్తోంది. సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో కీర్తి సురేశ్‌, మీనా, ఖుష్బూ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి సంగీతం: డి. ఇమ్మాన్‌, ఛాయాగ్రహణం: వెట్రి.



Advertisement


మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని