PelliSandaD: తెలుగులోగిళ్లలో మరోసారి పెళ్లి సందD షురూ..! - telugu news pelli sandad trailer launch by maheshbabu
close
Updated : 22/09/2021 18:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

PelliSandaD: తెలుగులోగిళ్లలో మరోసారి పెళ్లి సందD షురూ..!

ట్రైలర్‌ లాంఛ్‌ చేసిన సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు

హైదరాబాద్‌: దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు, నటుడు శ్రీకాంత్‌ కాంబినేషన్‌లో వచ్చిన సూపర్‌హిట్‌ చిత్రం ‘పెళ్లి సందడి’. చిన్న బడ్జెట్‌ చిత్రంగా తెరకెక్కి తెలుగువారికి అమితంగా చేరువైన ఈ సినిమాకి ఇప్పుడు కొనసాగింపుగా ‘పెళ్లి సందD’ రూపొందుతోంది. రాఘవేంద్రరావు పర్యవేక్షణలో శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. శ్రీలీల కథానాయిక. గౌరీ రోణంకి దర్శకత్వం వహిస్తున్నారు. దసరా కానుకగా వచ్చే నెలలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు ‘పెళ్లి సందD’ ట్రైలర్‌ను విడుదల చేశారు. రోషన్‌ - శ్రీలీల నటన.. మ్యూజిక్‌తో కీరవాణి చేసిన మ్యాజిక్‌ ఆకట్టుకునేలా ఉన్నాయి. ట్రైలర్‌ చూసిన నెటిజన్లు.. ‘తెలుగు లోగిళ్లలో మరోసారి పెళ్లి సందడి షురూ కానుంది’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమాతో రాఘవేంద్రరావు నటుడిగా వెండితెరపై మెరవనున్నారు. ప్రకాశ్‌ రాజ్‌, రాజేంద్రప్రసాద్‌, హేమ, ఝాన్సీ, రావు రమేశ్‌, వెన్నెల కిషోర్‌ తదితరులు ఇతర తారాగణం.





మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని