MAA Elections: ‘మా’ ఎన్నికలపై సీసీటీవీ ఫుటేజ్‌ ఇవ్వండి: ప్రకాశ్‌రాజ్‌  - telugu news prakashraj asks for maa election polling footage
close
Published : 18/10/2021 10:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

MAA Elections: ‘మా’ ఎన్నికలపై సీసీటీవీ ఫుటేజ్‌ ఇవ్వండి: ప్రకాశ్‌రాజ్‌ 

హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌లో జరిగిన మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌(మా) ఎన్నికలకు సంబంధించిన సీసీ ఫుటేజీ ఇవ్వాలని ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చవిచూసిన ప్రకాశ్‌రాజ్‌ పశ్చిమ మండల పోలీసు ఉన్నతాధికారులను ఆదివారం కోరారు. ఈ వ్యవహారంపై సోమవారం ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకొనే అవకాశాలు ఉన్నాయని ఓ పోలీసు అధికారి తెలిపారు.

ఎన్నడూ లేనివిధంగా ఈసారి ‘మా’ ఎన్నికలు ఎంతో హోరాహోరీగా జరిగాయి. అక్టోబర్‌ 10న జరిగిన ఎన్నికల్లో ‘మా’ అధ్యక్ష పదవి కోసం పోటీ పడిన మంచు విష్ణు, ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్స్‌ మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. పోలింగ్‌ సమయంలో విష్ణు ప్యానెల్‌ సభ్యులు తమపై దాడికి పాల్పడ్డారని ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌ సభ్యులు తీవ్ర ఆరోపణలు చేశారు. పోస్టల్‌ బ్యాలెట్‌లోనూ అక్రమాలు చోటుచేసుకున్నాయని.. వాటిపై స్పష్టత కోసమే సీసీటీవీ ఫుటేజ్‌ ఇవ్వాలని కోరుతూ ఇటీవల ప్రకాశ్‌రాజ్‌ ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌కు లేఖ రాశారు. ఈక్రమంలోనే ఆయన పోలీస్‌ అధికారులను కలిశారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని