MAA Election: అభిమాని ప్రయత్నం.. బాధ కలిగిస్తోందని ప్రకాశ్‌రాజ్‌ ట్వీట్‌ - telugu news prakashraj personal message to fan
close
Published : 19/08/2021 10:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

MAA Election: అభిమాని ప్రయత్నం.. బాధ కలిగిస్తోందని ప్రకాశ్‌రాజ్‌ ట్వీట్‌

హైదరాబాద్‌: మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ‘మా’ అధ్యక్ష ఎన్నికల్లో నటుడు ప్రకాశ్‌ రాజ్‌ విజయం సాధించాలని కోరుతూ ఆయన అభిమాని పాదయాత్ర చేపట్టాడు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్‌, కోలమూరు ప్రాంతానికి చెందిన రంజిత్‌కుమార్‌ కొంతకాలం నుంచి తెలుగు చిత్రపరిశ్రమలో జూనియర్‌ ఆర్టిస్ట్‌గా పనిచేస్తున్నారు. వృత్తిపరంగానే కాకుండా వ్యక్తిగతంగానూ ప్రకాశ్‌రాజ్‌కు వీరాభిమాని. ఈ క్రమంలోనే త్వరలో జరగనున్న ‘మా’ అధ్యక్ష ఎన్నికల్లో ఆయన విజయం సాధించాలని కోరుతూ కోలమూరు నుంచి హైదరాబాద్‌కు 485 కి.మీటర్ల పాదయాత్ర చేపట్టాడు.

కాగా, రంజిత్‌ చేస్తోన్న పాదయాత్ర గురించి తెలుసుకున్న ప్రకాశ్‌రాజ్‌ తాజాగా ట్వీట్‌ చేశారు. రంజిత్‌ను తిరిగి ఇంటికి వెళ్లిపొమ్మని సూచించారు. అంతేకాకుండా త్వరలోనే వ్యక్తిగతంగా కలుస్తానని మాటిచ్చారు. ‘రంజిత్‌ బంగారం.. నిస్వార్థంతో కూడిన మీలాంటి వారి అభిమానమే కళాకారుడిగా నన్ను ముందుకు నడిపిస్తోంది. మీ ప్రయత్నం నా మనసుకు బాధ కలిగిస్తోంది. నా మాటగా తిరిగి మీరు ఇంటికి వెళ్లి ఆనందంగా ఉండండి. త్వరలో మిమ్మల్ని వ్యక్తిగతంగా కలిసి మాట్లాడతాను’ అని ప్రకాశ్‌ రాజ్‌ ట్వీట్‌ చేశారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని