Ghani: బాక్సర్‌గా వరుణ్‌తేజ్‌.. ఫస్ట్‌ పంచ్‌ చూశారా? - telugu news presenting the first punch of varun tej ghani
close
Published : 06/10/2021 20:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Ghani: బాక్సర్‌గా వరుణ్‌తేజ్‌.. ఫస్ట్‌ పంచ్‌ చూశారా?

హైదరాబాద్‌: బాక్సర్‌గా తన పంచ్‌ పవర్‌ రుచి చూపించనున్నారు హీరో వరుణ్‌ తేజ్‌. బాక్సింగ్‌ నేపథ్య కథతో ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘గని’. కిరణ్‌ కొర్రపాటి దర్శకుడు. సిద్ధు ముద్ద, అల్లు బాబీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సయీ మంజ్రేకర్‌ కథానాయిక. ఉపేంద్ర, సునీల్‌ శెట్టి, నవీన్‌ చంద్ర తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి ‘ఫస్ట్‌ పంచ్‌’పేరుతో ఓ వీడియోను విడుదల చేసింది చిత్ర బృందం. ఇందులో కండలు తిరిగిన దేహంతో వరుణ్‌తేజ్‌ కనిపించారు. ‘‘తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి అందించేలా చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నాం. ఇందులో వరుణ్‌ బాక్సర్‌గా కనిపిస్తారు. ఈ పాత్ర కోసం ఆయన తన లుక్‌ పూర్తిగా మార్చుకున్నారు’’ అని నిర్మాతలు పేర్కొన్నారు. తమన్‌ స్వరాలు సమకూరుస్తున్న  ‘గని’  చిత్రాన్ని డిసెంబరు 3న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది.



Advertisement


మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని