MAA Elections: ప్రకాశ్‌రాజ్‌ ఎన్నికల్లో పోటీ చేస్తే తప్పేంటి: బండ్ల గణేశ్‌ - telugu news producer latest comments on maa elections
close
Updated : 04/09/2021 15:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

MAA Elections: ప్రకాశ్‌రాజ్‌ ఎన్నికల్లో పోటీ చేస్తే తప్పేంటి: బండ్ల గణేశ్‌

హైదరాబాద్‌: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌ (మా) ఎన్నికల్లో నటుడు ప్రకాశ్‌రాజ్‌ పోటీ చేస్తే తప్పేంటి? అంటూ నిర్మాత బండ్ల గణేశ్‌ ప్రశ్నించారు. తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ‘మా’ అధ్యక్ష ఎన్నికల గురించి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రకాశ్‌రాజ్‌ని నాన్‌లోకల్‌ అనడం పట్ల గణేశ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు 20 సంవత్సరాల నుంచి ప్రకాశ్‌రాజ్‌ తెలుగు సినిమాల్లో పనిచేస్తున్నారని.. ఆయన ఎలా నాన్‌ లోకల్‌ అవుతారని ప్రశ్నించారు. సినిమాల కోసం ముంబై, కేరళ, కర్ణాటక నుంచి హీరోయిన్స్‌ని టాలీవుడ్‌లోకి తీసుకువస్తే తప్పులేదు కానీ ప్రకాశ్‌రాజ్‌ ‘మా’ ఎన్నికల్లో పోటీ చేస్తే తప్పా అని అన్నారు. అంతేకాకుండా ప్రకాశ్‌రాజ్‌ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారని.. కరోనా సమయంలో వందల కుటుంబాలను ఆయన ఆదుకున్నారని తెలిపారు. ఒకవేళ ప్రకాశ్‌రాజ్‌ ‘మా’ అధ్యక్షుడైతే టాలీవుడ్‌కే గర్వకారణమని వ్యాఖ్యానిచ్చారు.

మరోకొన్ని రోజుల్లో నిర్వహించనున్న ‘మా’ అధ్యక్ష ఎన్నికలకు ఈ ఏడాది పోటీ హోరాహోరీగా ఉండనుంది. నిన్నటివరకూ విడివిడిగా పోటీ చేస్తున్నారనుకున్న జీవితా రాజశేఖర్‌, హేమ.. ఇప్పుడు ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌లోకి అడుగుపెట్టారు. దీంతో, ఈసారి ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్‌, మంచువిష్ణు ప్రధాన పోటీదారులుగా మారారు. మరోవైపు ప్రకాశ్‌రాజ్‌ ఇప్పటికే ‘‘సినీ‘మా’ బిడ్డలు’’ పేరుతో తన ప్యానెల్‌ని ప్రకటించారు. మంచు విష్ణు సైతం పోటీలో గెలుపొందేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని