Love Story: మిర్యాలగూడ సంఘటనకి ‘లవ్‌స్టోరి’కి సంబంధం లేదు: రామ్‌ మోహన్‌ - telugu news producer ram mohan rao about love story
close
Published : 18/09/2021 01:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Love Story: మిర్యాలగూడ సంఘటనకి ‘లవ్‌స్టోరి’కి సంబంధం లేదు: రామ్‌ మోహన్‌

హైదరాబాద్: నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ‘లవ్‌స్టోరి’. శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహించారు. సెప్టెంబరు 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాతల్లో ఒకరైన రామ్‌ మోహన్‌రావు ‘ఈటీవీ- ఈనాడు’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సినిమా గురించి సామాజిక మాధ్యమాల్లో జరుగుతోన్న ప్రచారం అసత్యమని ఖండించారు. మిర్యాలగూడ సంఘటనకి, ఈ చిత్ర కథకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ సినిమాని తెలుగు రాష్ట్రాల్లోని 600కుపైగా థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న పరిస్థితుల కారణంగా నిర్ణీత సమయానికంటే ముందే ప్రదర్శన మొదలుపెట్టి 4 ఆటలు ఆడించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని