Puri Musings: పొట్ట గురించి పూరి ఏమన్నారంటే? - telugu news puri musings on gut by puri jagannadh
close
Updated : 02/08/2021 19:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Puri Musings: పొట్ట గురించి పూరి ఏమన్నారంటే?

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాథ్ ‘పూరి మ్యూజింగ్స్’ పేరిట ప‌లు అంశాల గురించి తెలియ‌జేస్తోన్న సంగ‌తి తెలిసిందే. కొన్ని రోజుల విరామం అనంతరం ‘గట్‌’ పేరుతో కొత్త వీడియోను రూపొందించారు. పొట్ట (కడుపు)ని ఎలా చూసుకోవాలో ఇందులో వివరించారు. గట్‌ మన సెకండ్‌ బ్రెయిన్‌ అని, దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని తెలిపారు. ఆయన ఇంకా ఏం చెప్పారంటే...

‘‘మనం రోడ్డు మీద వెళ్లిన సమయంలో తిండిలేక పడిపోయిన ఓ ముసలమ్మ కనిపిస్తుంది. ఆ పరిస్థితి చూసి మన కడుపులో దేవేసినట్టుంటుంది. మరో సందర్భంలో.. ఓ రౌడీ అతి దారుణంగా ఎవరో అమాయకుడ్ని కొడుతుంటాడు. అప్పుడు మన కడుపు రగిలిపోద్ది. ‘ఎందుకురా ఇలా చేశావ్‌?’ అని అంటే ‘అవును రా చేశాను. ఊరికినే చేయలేదు నా కడుపు మండి చేశాను’ అంటాం. ఎందుకు ప్రతిసారీ కడుపు.. కడుపు అని వాడతాం. నా లివర్‌ మండింది అని అనం. నా లంగ్స్‌లో ఇలా ఉంది అని అనం. ప్రతిదానికీ కడుపే ఎందుకు గుర్తుకొస్తుంది. ఎందుకంటే కడుపే మన సెకండ్‌ బ్రెయిన్‌. మన బ్రెయిన్‌లో ఒక ఆలోచన వస్తే వెంటనే స్పందించేది మన బిల్లీ (గట్‌). మనం ఫీలయ్యే ప్రతి విషయానికీ మన లార్జ్‌ ఇంటెస్టయిన్స్‌ రియాక్ట్‌ అవుతాయి. ఏదైనా ఆహారాన్ని చూస్తే కడుపులో జ్యూసులు విడుదలవుతాయి. నమ్మిన మనిషి మోసం చేస్తే మనకి వాంతులవుతాయి. మీరు ఒత్తిడికి గురైతే మీ కడుపు ఇబ్బందిగా మారుతుంది. ఎవరిమీదైనా మీరు కోపంతో ఊగిపోతే మీ కడుపులో ఎసిడిటీ మొదలవుతుంది. అందుకే మన మైండ్‌ ఎప్పుడూ ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. చూసుకోకపోతే మన సెకండ్‌ మైండ్‌పై ప్రభావం పడుతుంది’’.

‘తినే ఆహారం వల్లే కాదు మన ఆలోచన వల్ల కూడా మన కడుపులో ఎసిడిటీ ప్రారంభమవుతుంది. కడుపు అప్‌సెట్‌ అయితే మనం ఏ పనీ చేయలేం. అందుకే మన గట్‌ ఎప్పుడూ బలంగా ఉండాలి. ఒక్కోసారి మనం సందేహంలో ఉంటే ‘నీ గట్‌ ఫీలింగ్‌ ఏంట్రా?’ అని మన స్నేహితుడు అడుగుతాడు. అంటే మన గట్‌ మనకు నిజం చెప్తుంది. ‘ఈసారి నా టార్గెట్‌ రీచ్‌ అయిపోతా. ఇది గట్‌ ఫీలింగ్‌’ అంటాం. అంటే మన మైండ్‌లో ఒక ఆలోచన వస్తే ఆఖరి నిర్ణయం మన గట్‌ తీసుకుంటుంది. అందుకే మన కడుపుని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇందుకు ప్రో బయోటిక్‌ ఫుడ్స్‌ తినాలి. అందులో పెరుగు ఒకటి. దీని వల్ల వ్యాధి నిరోధక శక్తీ పెరుగుతుంది. మీరు ఎలాంటి ఆహారం తింటే గట్‌ బాగుంటుందో మీ డాక్టర్‌ని అడిగి తెలుసుకోండి. ఒక గదిని ఎప్పుడూ వాడుతుంటే దాన్ని శుభ్రం చేయలేం. క్లీన్‌ చేయాలంటే వాడటం ఆపాలి. అలాగే పొట్టకి కూడా గ్యాప్‌ ఇవ్వండి. అప్పుడప్పుడు దాన్ని ఖాళీగా ఉంచండి. మీ చిట్టి పొట్టని సరిగ్గా చూసుకోకపోతే మీ కెరీర్‌ ఎఫెక్ట్‌ అవుతుంది. మీ గట్‌ స్ట్రాంగ్‌గా ఉంటేనే మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మీ గట్‌ ఫీలింగ్స్‌ ఎప్పుడూ కరెక్టే’ అని తెలిపారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని