Anand Deverakonda: మాటల ‘పుష్పక విమానం’ విడుదల తేదీ ఫిక్స్‌ - telugu news pushpaka vimanam movie release date announcement
close
Published : 28/09/2021 16:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Anand Deverakonda: మాటల ‘పుష్పక విమానం’ విడుదల తేదీ ఫిక్స్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘దొరసాని’, ‘మిడిల్‌క్లాస్‌ మెలొడీస్‌’ చిత్రాలతో అలరించిన నటుడు ఆనంద్‌ దేవరకొండ. ప్రస్తుతం ‘పుష్పక విమానం’ అనే డార్క్‌ కామెడీ చిత్రంతో బిజీగా ఉన్నాడు. దామోదర దర్శకత్వం వహిస్తున్నారు. గోవర్థన్‌ రావు దేవరకొండ, విజయ్‌ మిట్టపల్లి, ప్రదీప్‌ ఎర్రబెల్లి నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని నవంబరు 12న విడుదల చేస్తున్నట్టు చిత్ర బృందం తాజాగా ప్రకటించింది. ఇందులో సునీల్‌, నరేశ్‌ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఆనంద్‌ సరసన గీత్‌ షైనీ, శాన్వీ మేఘన సందడి చేయనున్నారు. కమల్‌హాసన్‌, అమల జంటగా సింగితం శ్రీనివాసరావు దర్శకత్వంలో ‘పుష్పక విమానం’ పేరుతో మూకీ చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. మాటలు లేని ఆ సినిమా విశేష ఆదరణ పొందింది. దాంతో అదే పేరుతో వస్తోన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.



 




మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని