Anubhavinchu Raja: నవ్వులు పూయించేలా ‘అనుభవించు రాజా’ టీజర్‌ - telugu news raj tarun starer anubhavinchu raja teaser out now
close
Updated : 23/09/2021 10:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Anubhavinchu Raja: నవ్వులు పూయించేలా ‘అనుభవించు రాజా’ టీజర్‌

హైదరాబాద్‌: రాజ్‌తరుణ్‌ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న సరికొత్త చిత్రం ‘అనుభవించు రాజా’. శ్రీను గావిరెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టీజర్‌ను గురువారం ఉదయం మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ సోషల్‌మీడియా వేదికగా విడుదల చేశారు. ఉభయ గోదావరి జిల్లాల నేపథ్యంలో సాగే ఓ యూత్‌ఫుల్‌ లవ్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో రాజ్‌తరుణ్‌ కోడిపందెలు అంటే ఆసక్తి కనబరిచే బంగారం అనే యువకుడి పాత్రలో కనిపించనున్నారు. ‘బంగారం గాడు ఊర్లోని.. వాడి పుంజు బరిలోని ఉండగా.. ఇంకొండు గెలవడం కష్టమెహే’ అంటూ ఆయన చెప్పే డైలాగ్‌లు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇందులో రాజ్‌తరుణ్‌ సరసన కషికా ఖాన్‌ సందడి చేయనున్నారు. పోసాని కృష్ణ మురళీ, అజయ్‌, సుదర్శన్‌, టెంపర్‌ వంశీ కీలకపాత్రలు పోషించారు. అన్నపూర్ణ స్టూడియోస్‌, శ్రీ వేంకటేశ్వర సినిమాస్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. గోపీ సుందర్‌ స్వరాలు అందిస్తున్నారు.
మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని