Rajamouli: సల్మాన్‌ను కలిసిన రాజమౌళి! - telugu news rajamouli and his son karthikeya meets salmankhan at his residency
close
Published : 22/11/2021 20:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Rajamouli: సల్మాన్‌ను కలిసిన రాజమౌళి!

ప్రముఖ దర్శకుడు రాజమౌళి, బాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు సల్మాన్‌ఖాన్‌ని కలిసినట్లు తెలుస్తోంది.  శనివారం ముంబయిలో తన తనయుడు కార్తికేయతో కలిసి కొంతసేపు సల్మాన్‌తో ముచ్చటించినట్లు బాలీవుడ్‌ సమాచారం. ఇద్దరి  కలయికపై పలు రకాల వార్తలొస్తున్నాయి. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ప్రచారం కోసమే కలిశాడని, ప్రీ రిలీజ్‌ వేడుకకు అతిథిగా ఆహ్వానించడానికి అంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇద్దరి కలయికలో ఓ సినిమా రాబోతుందంటూ కూడా వదంతులు వస్తున్నాయి. రాజమౌళి ప్రస్తుతం ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ ప్రచారంలో బిజీగా ఉన్నారు.  జనవరి 7న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని