Ram Charan: రామ్‌ చరణ్‌ 14 ఏళ్ల నట ప్రస్థానం.. వెల్లివిరిసిన అభిమానం - telugu news ram charan completed 14 years as an actor
close
Published : 28/09/2021 01:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Ram Charan: రామ్‌ చరణ్‌ 14 ఏళ్ల నట ప్రస్థానం.. వెల్లివిరిసిన అభిమానం

ఇంటర్నెట్‌ డెస్క్‌: టాలీవుడ్‌ ప్రముఖ నటుడు రామ్‌ చరణ్‌ తెలుగు ప్రేక్షకులకు పరిచయమై 14 ఏళ్లు గడిచాయి. ఈ సందర్భంగా ఆయన అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. రామ్‌ చరణ్‌పై ఉన్న అభిమానాన్ని వినూత్న శైలిలో చాటుకున్నారు. నెక్లెస్‌ రోడ్డు సమీపంలో రామ్‌ చరణ్‌ బొమ్మని గీసి, దానికి రంగులు వేసి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ‘మ్యాన్‌ ఆఫ్‌ మాసెస్‌’ అని రాసుకొచ్చారు. ‘రాష్ట్ర రామ్‌ చరణ్‌ యువశక్తి’ ఆధ్వర్యంలో సాగిన ఈ వేడుకలో పలువురు అభిమానులు పాల్గొని సందడి చేశారు.

‘చిరుత’ చిత్రంతో రామ్‌ చరణ్‌ నటుడిగా మారారు. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2007 సెప్టెంబరు 28న విడుదలైంది. మంచి విజయం అందుకుంది. పవర్‌ఫుల్‌ సంభాషణలు, ఉర్రూతలూగించే డ్యాన్స్‌తో తొలి పరిచయంలోనే విశేషంగా ఆకట్టుకున్నాడు రామ్‌ చరణ్‌. ఆ తర్వాత ‘మగధీర’, ‘రచ్చ’, ‘నాయక్‌’, ‘ఎవడు’, ‘గోవిందుడు అందరివాడేలే’, ‘ధ్రువ’, ‘రంగస్థలం’ తదితర చిత్రాలతో మెప్పించారు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంతో బిజీగా ఉన్నారు. మరోవైపు, కోలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు శంకర్‌తో ఓ చిత్రం చేయనున్నారు.



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని