RC 16: రామ్‌చరణ్‌ తదుపరి ప్రాజెక్ట్‌.. అధికారిక ప్రకటన వచ్చేసింది..! - telugu news ram charan next movie conformed
close
Published : 15/10/2021 10:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

RC 16: రామ్‌చరణ్‌ తదుపరి ప్రాజెక్ట్‌.. అధికారిక ప్రకటన వచ్చేసింది..!

హైదరాబాద్‌: మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ ప్రాజెక్ట్‌ల విషయంలో దూకుడు పెంచేశారు. శంకర్ సినిమా షూట్‌ ప్రారంభంకాకముందే ఆయన మరో సినిమా ప్రకటించేశారు. ఈ మేరకు చెర్రీ హీరోగా యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై రూపుదిద్దుకోనున్న ఈ చిత్రానికి ‘జెర్సీ’ ఫేమ్‌ గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వం వహించనున్నారు. రామ్‌ చరణ్‌ 16వ ప్రాజెక్ట్‌గా ఈ సినిమా సిద్ధం కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ శుక్రవారం ఉదయం చరణ్‌ ట్వీట్‌ చేశారు. ఈ కాంబినేషన్‌ కోసం తాను ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు గౌతమ్‌ సైతం.. చెర్రీతో కలిసి పనిచేయడం పట్ల ఆనందం వ్యక్తంచేశారు. ‘జెర్సీ’ విడుదలైన సమయంలో గౌతమ్‌ పనితనాన్ని ప్రశంసిస్తూ చరణ్‌ దంపతులు ఓ లేఖ రాశారు. తాజాగా ఆ లేఖను ట్విటర్‌లో షేర్‌ చేసిన గౌతమ్‌.. ‘ఎంతోకాలం నుంచి ఈ లేఖను దాచిపెట్టుకున్నాను. చరణ్‌తో కలిసి పనిచేసే అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా దాన్ని బయట ప్రపంచానికి చూపించాలనుకున్నాను. ఇంత త్వరగా ఈ అవకాశం నాకు వస్తుందని అనుకోలేదు. లవ్‌ యూ చరణ్‌ సర్‌’ అని గౌతమ్‌ ట్వీట్‌ చేశారు.

ప్రస్తుతం రామ్‌చరణ్‌.. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘ఆచార్య’ చిత్రాల్లో నటిస్తున్నారు. ఆ రెండు పూర్తైన వెంటనే ఆయన శంకర్‌తో చేయనున్న సినిమా రెగ్యులర్‌ షూట్‌లో పాల్గొననున్నారు. పవర్‌ఫుల్‌ కథాంశంతో సిద్ధం కానున్న ఈ సినిమాలో చరణ్‌ ప్రభుత్వ అధికారిగా కనిపించనున్నారు. కియారా అడ్వాణీ కథానాయిక. శ్రీకాంత్‌ కీలకపాత్రలో కనిపించనున్నారు. దిల్‌రాజు నిర్మాత.


Advertisement


మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని