Sudheer Rashmi: ఎట్టకేలకు సుధీర్‌కు తన ప్రేమను చెప్పిన రష్మి - telugu news rashmi proposed to sudheer with special gifts
close
Published : 11/09/2021 14:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Sudheer Rashmi: ఎట్టకేలకు సుధీర్‌కు తన ప్రేమను చెప్పిన రష్మి

ఈ మధ్య మరింత క్లోజ్‌ అయినందుకు ఆనందంగా ఉంది: సుధీర్‌

హైదరాబాద్‌: సుడిగాలి సుధీర్‌పై తనకున్న ఇష్టాన్ని ఎట్టకేలకు బయటపెట్టారు నటి రష్మి. తొమ్మిదేళ్ల నుంచి తనలో దాచుకున్న ప్రేమను తొమ్మిది అపురూపమైన గిఫ్ట్స్‌తో ఆయనకు తెలియజేశారు. రష్మి అంటే తనకు ఎంతో ఇష్టమని సుధీర్‌ అన్నారు. వీరి ప్రేమానుబంధానికి ‘ఊరిలో వినాయకుడు’ స్టేజ్‌ వేదికైంది. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈటీవీలో ప్రసారమైన ప్రత్యేక కార్యక్రమం ‘ఊరిలో వినాయకుడు’. అలనాటి నటీమణులు రోజా, ఇంద్రజ టీమ్‌ లీడర్లగా, రష్మి-సుధీర్‌ వ్యాఖ్యతలుగా ఈ వేడుక జరిగింది. ఇందులో భాగంగా సుధీర్‌-రష్మిల రిలేషన్‌షిప్‌ గురించి రోజా మాట్లాడుతూ... ‘మీ ఇద్దరి రిలేషన్‌షిప్‌ గురించి చాలామంది మాట్లాడుకుంటున్నారు. స్పష్టత కోసం ఎదురుచూస్తున్నారు’ అని అడగ్గా.. ఇంద్రజ మధ్యలో అందుకుని.. ‘సుధీర్‌ ఎప్పటి నుంచో చెబుతున్నాడు. కానీ రష్మి దగ్గర నుంచి ఎలాంటి సమాధానం లేదు’ అని అంటుంది.

రోజా-ఇంద్రజల మాటలపై స్పందించిన రష్మి.. ఈ రోజు ఆ సమాధానం ఇచ్చేస్తానంటూ.. తొమ్మిది సంవత్సరాల తమ ప్రేమ ప్రయాణానికి గుర్తుగా తొమ్మిది అపురూపమైన గిఫ్ట్స్‌ ఇచ్చి.. తన ప్రేమను తెలియజేస్తుంది. రష్మి ఇచ్చిన సర్‌ప్రైజ్‌లకు సుధీర్‌ ఫిదా అయిపోయి ఆమెను హత్తుకుని.. ఒకింత ఎమోషనల్‌ అవుతాడు. ‘తొమ్మిదేళ్ల క్రితం ఇది ప్రారంభమైంది. ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్‌ చేయడం కోసం ఆన్‌స్క్రీన్‌పై మనం ఇలా కలవడం బాగుంది. పర్సనల్‌గా మాట్లాడుకోవడం, ఈ మధ్యకాలంలో మనం ఇంకా క్లోజ్‌ కావడం నాకెంతో ఆనందంగా ఉంది. ఈ గిఫ్ట్స్‌ అన్నింటికీ ధన్యవాదాలు. నువ్వు ఎప్పుడు ఇలాగే నవ్వుతూ.. సంతోషంగా ఉండాలని కోరుకుంటాను. ఐ లైక్‌ యూ’ అని సుధీర్ తెలిపారు.



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని