IND vs PAK: కోహ్లీ తీరుపై ఆర్జీవీ ఆసక్తికర పోస్ట్‌ - telugu news rgv appreciates virat kohli sportsman spirit
close
Published : 25/10/2021 13:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

IND vs PAK: కోహ్లీ తీరుపై ఆర్జీవీ ఆసక్తికర పోస్ట్‌

హైదరాబాద్‌: టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీని ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ మెచ్చుకున్నారు. ఓటమి అనంతరం దాయాది జట్టుతో కోహ్లీ ప్రవర్తించిన తీరు అద్భుతంగా ఉందని ఆయన అన్నారు. ఎటువంటి పంతాలు, పట్టింపులకు పోకుండా ఓటమి అనంతరం ప్రత్యర్థి జట్టు క్రీడాకారులను నవ్వుతూ అభినందించడం నిజమైన క్రీడాస్ఫూర్తికి అద్దంపట్టేలా ఉందంటూ ఆర్జీవీ ట్వీట్‌ చేశారు. మరోవైపు,  భారత్‌ ఓటమి పట్ల పలువురు సెలబ్రిటీలు సైతం స్పందించారు. ‘గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కంటే భయంకరంగా ఉంటుంది. టీమ్‌ఇండియా త్వరలోనే తప్పకుండా గట్టి జవాబునిస్తుంది. పిక్చర్‌ అబీ బాకీ హై మేరీ దోస్త్‌’ అంటూ పోస్టులు పెడుతున్నారు.

దుబాయ్‌ వేదికగా ఆదివారం సాయంత్రం జరిగిన టీ20 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్‌ ఓటమి చవి చూసిన విషయం తెలిసిందే. 10 వికెట్ల తేడాతో భారత్‌పై పాక్‌ విజయం సాధించింది. విజయం అనంతరం కోహ్లీ పాక్‌ ఓపెనర్లు మహమ్మద్‌ రిజ్వాన్‌, బాబర్‌ అజామ్‌లను నవ్వుతూ అభినందించారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే.




Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని