RGV: ఏపీ రాజకీయాలపై వర్మ ట్వీట్‌ - telugu news rgv comments on latest ap politics
close
Updated : 21/10/2021 11:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

RGV: ఏపీ రాజకీయాలపై వర్మ ట్వీట్‌

హైదరాబాద్‌: అంశమేదైనా సరే తనదైన శైలిలో స్పందించి తరచూ వార్తల్లో నిలుస్తుంటారు ప్రముఖ దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ. తాజాగా ఆయన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజకీయాలపై వ్యంగ్యాస్త్రాలు విసిరారు. రాజకీయ నాయకులు బాక్సింగ్‌ నేర్చుకోవాలంటూ వ్యాఖ్యానించారు. ఈ మేరకు వర్మ గురువారం ఉదయం ట్విటర్‌ వేదికగా ఏపీ రాజకీయాలపై కామెంట్స్‌ చేశారు. ‘‘ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పరిస్థితులు చూస్తుంటే అతిత్వరలో అక్కడ నాయకులు బాక్సింగ్‌, కరాటే, కర్ర యుద్ధం నేర్చుకోవాల్సి ఉంది’’ అని ఆర్జీవీ వ్యంగ్యంగా అన్నారు.

తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై అల్లరిమూకల దాడితో ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కిన విషయం తెలిసిందే. కేంద్ర కార్యాలయంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పార్టీ కార్యాలయాలపై జరిగిన దాడియత్నాలకు నిరసనగా బుధవారం తెదేపా బంద్‌ నిర్వహించింది. ఈ క్రమంలోనే అధికార, ప్రతిపక్ష పార్టీ నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. మరోవైపు పార్టీ శ్రేణులపై దాడులను నిరసిస్తూ గురువారం ఉదయం నుంచి 36 గంటలపాటు తెదేపా అధినేత చంద్రబాబు దీక్ష చేపట్టారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని