Deepveer And AishAbhi: ఫొటోలు చూసి.. గుడ్‌న్యూస్‌ చెప్పాలంటూ కామెంట్లు..! - telugu news rumours on deepika padukone and aishwarya
close
Published : 01/08/2021 13:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Deepveer And AishAbhi: ఫొటోలు చూసి.. గుడ్‌న్యూస్‌ చెప్పాలంటూ కామెంట్లు..!

బీటౌన్‌ స్టార్‌ హీరోయిన్స్‌పై నెట్టింట్లో వరుస పోస్టులు

ముంబయి: బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్స్‌ ఐశ్యర్యరాయ్‌, దీపికా పదుకొణెకు విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. లాక్‌డౌన్‌ అనంతరం సినిమా చిత్రీకరణలతో ఎంతో బిజీగా ఉంటున్న ఈ ఇద్దరి ఫొటోలు కొన్నిరోజలుగా నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పుడు వాటి గురించే అందరూ చర్చించుకుంటున్నారు. ‘నిజం చెప్పండి మేడమ్‌’ అంటూ వరుస కామెంట్లు పెడుతున్నారు. అసలేం జరిగిందంటే..

చాలా కాలం విరామం తర్వాత ఐష్‌ కీలకపాత్రలో నటిస్తున్న దక్షిణాది చిత్రం ‘పొన్నియిన్‌ సెల్వన్‌’. ప్రముఖ దర్శకుడు మణిరత్నం ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూట్‌ చెన్నై పరిసర ప్రాంతాల్లో శరవేగంగా సాగుతోంది. కాగా, ఈ సినిమా షూట్‌లో భాగంగా తాజాగా ఐష్‌ తన భర్త అభిషేక్‌తో కలిసి చెన్నై చేరుకున్నారు. ఈక్రమంలోనే నటి వరలక్ష్మి శరత్‌కుమార్‌తో కలిసి ఫొటోలకు పోజులిచ్చారు. వరలక్ష్మి ఆ ఫొటోలను సోషల్‌మీడియాలో షేర్‌ చేశారు. కాగా, ఆ ఫొటోలు చూసిన పలువురు నెటిజన్లు.. ఐష్‌ తల్లికాబోతుందంటూ ప్రచారం చేస్తున్నారు. అంతేకాకుండా ‘ఐష్‌జీ కంగ్రాట్స్‌.. త్వరగా గుడ్‌న్యూస్‌ బయట పెట్టండి’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు, ఐష్‌-అభిషేక్‌ దంపతులకు ఆరాధ్య అనే పాప ఉన్న విషయం తెలిసిందే.

ఇక, బీటౌన్‌ స్టార్‌ కపుల్‌ దీపికా పదుకొణె-రణ్‌వీర్‌ సింగ్‌ విషయానికి వస్తే.. కొన్నేళ్లపాటు ప్రేమించుకున్న వీరిద్దరూ 2018లో వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం కెరీర్‌లో దూసుకెళ్తోన్న రణ్‌వీర్‌-దీపికా తాజాగా ముంబయిలోని ఓ ప్రముఖ ఆస్పత్రి నుంచి బయటకు వస్తూ కనిపించారు. వాటిని చూసిన పలువురు.. వాళ్లిద్దరూ త్వరలోనే శుభవార్త బయటపెట్టనున్నారని.. వైద్య పరీక్షల నిమిత్తమే ఆస్పత్రికి వచ్చారని మాట్లాడుకుంటున్నారు. దీంతో ఈ ఫొటోలు కూడా నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని