Samantha: నవంబర్‌ నుంచి కొత్త ప్రయాణం.. తిరుమలలో విలేకరికి ఘాటు సమాధానం! - telugu news samantha signs new project
close
Updated : 18/09/2021 21:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Samantha: నవంబర్‌ నుంచి కొత్త ప్రయాణం.. తిరుమలలో విలేకరికి ఘాటు సమాధానం!

అగ్ర కథా నాయిక సమంత కథానాయిక ప్రాధాన్యం ఉన్న చిత్రాలకి   కేరాఫ్‌గా మారింది. ఇటీవలే ‘శాకుంతలం’ సినిమాని పూర్తి చేసింది. కొన్ని రోజులుగా విశ్రాంతి తీసుకుంటున్న ఆమె ఇంతలోనే కొత్త కథకి పచ్చజెండా ఊపేసింది. ఓ కొత్త దర్శకుడు చేయనున్న సినిమా అది. శ్రీదేవి మూవీస్‌ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్‌ నిర్మించనున్నారు. వినూత్నమైన కథ కావడంతో, సమంత వెంటనే సినిమా చేయడానికి అంగీకరించారని, నవంబర్‌ నుంచి ఆ సినిమా ప్రయాణం మొదలు కానుందని తెలిసింది. అదీ కథానాయిక ప్రాధాన్యం ఉన్న సినిమా అని సమాచారం.

కాగా శనివారం సమంత తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో ఆమె పాల్గొన్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను ఆమె స్వీకరించారు. ఈ సందర్భంగా నాగచైతన్య-సమంత విషయంలో వస్తున్న రూమర్స్‌పై ఓ విలేకరి ప్రశ్నించగా సామ్‌ కాస్త ఘాటుగానే స్పందించారు.




Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని